పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

167


రంగారెడ్డి గారికి వివాహము చేయులాగున నిశ్చయ మయ్యెను. రెడ్డిగారు తమశక్తిని వినియోగించి ఆమె పేర విరాసతును పొందించెను. అది పూర్తి యైనంతనే వనపర్తి రాజూగారు ఆమెను పెండ్లాడిరి. ఇది మనస్తాపములకు కారణ మయ్యెను. కాని వనపర్తి రాజగారా వివాహమువలన సౌఖ్యమందక పోయిరి. అనూత్న రాణీగారికి సంతానము నిలువక పోయెను. ఆమెయు గతించెను. ఆమె సంస్థానము రాజుగారికి దక్కక ఆమె వంశీయులగు వారసులకు చెందెను. వనపర్తి మహా రాజుగారును క్షయరోగ పీడితులై అవసాన దశకు వచ్చిరి. ఇంకకొన్ని దినములలో చనిపోవుదురనగా శ్రీ మహారాజాగారు వేంకటరామా రెడ్డిగారిని తమ వద్దకు పిలిపించుకొని కంటనీరు పెట్టుకొని జరిగిన అపకార మంతయు మరచి పొమ్మని చెప్పి తన యిద్దరి చిన్న కుమారులను రెడ్డిగారి చేతులలో పెట్టి తనకు మారుగా విచారించు కొనుమని చెప్పిరి. ఉభయులును ఒకరనొకరు పట్టుకొని కన్నీరు కార్చినారు. ద్వేష మంతయు ఆకన్నీటి కాల్వలో కొట్టుకొని పోయెను. మురల యథాపూర్వముగా ప్రసన్ను లైరి.


వనపర్తి మహా రాజుగారు దివంగతులైరి. వారి సంస్గానము కోర్టు నిగరానీలో చేరెను. వారి పెద్దకుమారులు తము 20 వ ఏటనే మరణించిరి. చిన్నకుమారులగు రాజా రామ