పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168


దేవ రావుగారును, పెద్ద కుమారులగు రాజా కృష్ణ దేవరాయలకు కలిగిన ఒక శిశువును మిగిలిరి. కాని శిశువు పక్షము వారికి రాజా రామ దేవరావు బహద్దరుగారికి రాజ్య భాగములో. వివాదమేర్పడెను. రా! బ! వెంకటరామా రెడ్డిగారు తమ వాగ్దాన ప్రకారము రాజారామ దేవ రావు గారి కాశ్రయ భూతులై వారిభాగము వారికి దొరకునట్లు ప్రయత్నించిరి.


గద్వాల సంస్థానము ఈ రాష్ట్రములోని ఆంధ్ర సంస్థానము లలో ప్రాచీన మైనదియ, పెద్దదియునై యున్నది. దాని పరిపాలకులగు శ్రీ మహారాజా సోమ భూపాలరావు గారి కాలములో కొందరు ప్రజలు అల్లరులు చేయగా రెడ్డి గారు వారికి సాయపడిరి. మరియు గద్వాల మహారాజు గారు నిండు వయస్సులో మృత్యువు వాతపడగా గద్వాల సంస్థా సము కోర్టు ఆధీనమయ్యెను. మహా రాజు గారికి పుత్రసంతానము లేదు. ఇద్దరు బిడ్డలు మాత్రముండిరి. అందుచేత సంస్థనము ఖాల్సాలో చేర్చబడునో యేమో అని వదంతులు బయలు దేరెను. అప్పుడును రెడ్డిగారు తమచేత నైన సహాయము చేసి తుదకు శ్రీ ప్రభువుగారికి నచ్చచెప్పిరి. సంస్థానమును మహారాణీగారి వశముచేసి వారి దౌహిత్రునికి రాజ్యాధీకారము కలుగునట్లు ఫర్మాను వెలువడెను.