పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

101


యువరాజు గారు వీదులలో వెళ్ళునపుకు దూరములో ఎన్నియోబండ్లు, - మంది, మోటారులు, సైకిళ్ళు అన్నియు కనుపించు చుండెడివి. దగ్గరకు వచ్చువరకు అన్ని యు మాయము. ఇది వారికి ఆశ్చర్యము కలిగించెను. వారి మిలిటరీ సెక్రటరీగారు గొత్వాలు గారి నిట్లు విచారించినారు. మీవీధు లన్నింటిలో భూసురంగము లేమైన యున్నవా? బండ్లన్నియు జనసమూహమంతయు గారడివాని చేతినస్తువులవలె అప్పటి కప్పుడే మాయమగు చుండును. అప్పటి కప్పుడే పుట్టు చుండును" అని విచారంచి నారు. రెడ్డి గారి ఏర్పాట్లలోని విచిత్రములలో విచిత్ర మిదొకటి! ప్రజలకు ఏవిధమగు నష్ట కష్టములు కలుగకుంకునట్లుగా చూచుకొనుటయే వారి ప్రధానోద్దేశమై యుండెను.


యువరాజు గారు అయిదవ దినము నగరమునుండి వెళ్ళు వారైయుండిరి. అందరితోను సెలవు తీసుకొనుచుండిరి. తమ విడిది సౌధములోనికి ప్రధాన మంత్రిగారిని, మహారాజులను, నవాబులను, అధి కారులను నొకరి వెంట నొకరిని పిలిపించి రెండు మూడు నిముషాలు వారితో మాట్లాడి వారికేదో బహుమతి యిచ్చి పంపుచుండిరి. వేంకట రామా రెడ్డిగారి వంతు వచ్చినది. వారు ద్వారము వద్దకు వెళ్ళి అచ్చటి ప్రై వేటు కార్యదర్శితో ఇట్లు చెప్పి పంపినారు. నాకు సరిగా