పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                వేమన యోగసిద్ధి-మత ప్రచారము 87

యేమి? ఆ 'ఋతంభర' యను ప్రజ్ఞ మహత్వమంతయు వట్టిమాటలేనా? తరిగొండ వెంకమ్మవంటి యోగినిని మనకు ప్రసాదించిన 'సు బ్రహ్మణ్యయోగి యీ విషయ మున నితనికంటె ప్రపంచమున కెక్కువ యుపకరించినాఁడని తలఁచినఁ దప్పేమి? అది యట్లుండనిండు.

వేమన్న యిట్లు వీరశైవమతమందుఁ బుట్టి, సంసార సుఖదుఃఖములన్నియు ననుభవించి, రసవాద సంబంధమున శివయోగుల సహవాసమునఁబడి విరక్తుడై హఠయోగమును సాధించి, యాపిమ్మట రాజయోగియై, హరిహరాది సగుణోపాసన మీఱి బ్రహ్మసాయుజ్యరూపమగు అద్వైతానంద మనుభవించి జీవన్ముక్తుఁడైనాడని మన మూహించితిమి,

ఈ సందర్భమున వేమన మతమును గూర్చిన వేరొక్క సిద్ధాంతమును కొంత చర్చింపవలసి యున్నది. వేమన్న తాంత్రికుఁడని కొందఱందురు.*[1] అగుననియు చెప్పవచ్చును; కాఁడనియుఁ జెప్పవచ్చును. తాంత్రికశబ్దమునకు చాలవిశాలమైన యర్థము గలదు. తంత్రమనఁగా పరబ్రహ్మసాక్షాత్కారమును సంపాదించుటకు పనికి వచ్చు సాధన. మంత్రములు, బీజాక్షరములు, యంత్రములు, ముద్రలు, పూజలు మొదలగు బహిరంగములు, షట్చక్రభేదము, కుండలియోగము మొదలగు నంతరంగములును, తంత్రమని పేర్కొనఁబడుచున్నవి. దీని నాశ్రయించినవారు తాంత్రికులు. అనఁగా హిందూదేశమందన్ని మతముల వారును తాంత్రికులే. వారివారి మతసిద్ధాంతములను సత్యావనముచేసి యనుభవింపగోరు వారందరును తంత్రమార్గమునే యవలంబించిరి. కాని కొందఱు ఆ మార్గమందు మద్యమాంసాది పంచమకారములకు ప్రాముఖ్యము నిచ్చి యందుచే తమ పూజాదిసాధసలు బహిరంగముగా జరుపుకొనలేక రహస్యముగా నుంచుకొనుటవలన, తక్కినవారికన్న భిన్నులై 'తాంత్రికు' లనఁబడుచున్నారు. స్మృతి ప్రమాణము నంగీకరించిన వారందఱును స్మార్తులైనను శాంకరాద్వైత బ్రాహ్మణులు మాత్రమా పేరున పిలువఁ బడినట్లే, వీరికిని వ్యవహారముచే నా పేరువచ్చినది. ఈ తాంత్రికులును అద్వైతులే, కాని వీరు శివతత్త్వమును పూజించుటకు ముందు శక్తిని పూజింతురు కావున *శా క్షేయు' లనఁబడిరి. ఉత్తరదేశమందు వీరి గుంపు బలము. మద్యమాంసాది సేవనచేతను, శ్మశానపూజాదుల చేతను వీరిని వామాచారులనియు నందురు. వానిని వర్ణించిన దక్షిణదేశమువారు దక్షిణాచారులనఁబడిరి. వేమన వామాచారుల గుంపుతో సంబంధమే లేనివాఁడు. వారి యాచారము లొకటియు గిట్టవు. వామాచారము లట్లుండనిండు. జాతిభేదము వారికిఁగలదు. చక్రపూజాసమయములందు మాత్రము జాతిభేదమును గమనింపఁగూడదు కాని దానికి బైట మనకు నాలుగుజాతులై స వారి కైదు జాతులు (మహానిర్వాణతంత్రముఉల్లా,8,ప, 5)వేఱువేఱు జాతులకు వేఱువేఱు సంస్కారములు (అచే, 13). బ్రాహ్మణాదులు ముగ్గురికిని ఉపవీత ములు కలవు. (ఆదే. 5-5) తమకస్న తక్కుపజాతివారి యన్నము తిన్నవారికి ప్రాయశ్చిత్తము గలదు (అదే. 11-1-29). కాని మొదలగు తీర్ధక్షేత్రములు పావనములని వారి నమ్మిక (యోగినీతంత్రము, 19 పటలము). బ్రాహ్మణులకు మర్యాద చేయవలయును (అదే. 13) విగ్రహపూజ యున్నది. ప్రతిమలశిలలను

 1. * ఈ మతము శ్రీవేమూరు విశ్వనాథశర్మ గారిది. దీని విషయమై వివరించుచు వారు దయయుంచి నాకొక దీర్ఘ లేఖ వ్రాసిరి.