పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                             వేమన     86

జేసికొన్న తరువాత, స్త్రీ విషయమందిట్టి యపచారములు తప్పని గమనించినారు.

 
           "శతాపరాధైర్వనితాం పప్పేణాపి నతాడయే
             దోషాన్న గణయేత్ స్త్రీణాం గుణానేవ ప్రకాశయేత్"
                                                   (కులార్థవతంత్రము, 11 ఉల్లాసము)

(నూరుతప్పలు చేసినను స్త్రీని పూవుతోనైనను గొట్టరాదు. వారి దోషములు బైలు పెట్టరాదు. గుణములనే వెల్లడిచేయవలెను.)

వైష్ణవులింకను దూరముపోయిరి. స్త్రీయందు పాపమను పదార్ధమే యుండ దనిరి !

           “వనితాయాం తథాశకదురితం నైవవిద్యతే" (లక్ష్మితంత్రము, 43 అధ్యా)

ఇది మరొక ధ్రువము గదా, ఐనను సామాన్యముగ స్త్రీ భోగ్యవస్తువనియు, మగవానిని జెఱుచుటకే సృజింపఁబడినదనియు రూఢమూలమైయున్న భావము మనలో నింకను నశింపలేదు.

వేమన యిట్టిసంఘమందు పెరిగినవాఁడు. స్త్రీలచే చాలకష్టము లనుభవించిన వాఁడు. తాను సాధించు మనోనిగ్రహమునకు వారు పలుమాఱు విఘ్నములుగా దా(పురించి యుండవచ్చును. కావున నట్టియవస్థలో తన దౌర్బల్యమును నిందించి కొనక, స్త్రీజాతినే బూతులు దిట్టినాఁడు.

 
             "గతులు సతులవలనఁ గానంగలేరయా" (3832)
             "ఆఁడు దనఁగ రోత- ... " (230)
             ఇత్యాదులనేకములు. మఱియు, ప్రభువు, ప్రజలు వీరినిగూర్చిన. -
            "ఆ. ప్రజయొనర్చు చెడుగు ప్రభువునకు వచ్చును,
              ప్రభువు మంచియందు ప్రజకు సగము,
              ప్రభువొనర్పుచెడుగు ప్రజలకు రాదురా..? (2622)

ఈ న్యాయమే భార్యాభర్తల విషయమందును వర్తించునని ధర్మశాస్త్రములు చెప్పచున్నవి. కాని వేమన్నకివి న్యాయమని తోఁపలేదు,
       "ఆ. సతియొనర్చు చెడుగు పతికవశ్యమువచ్చు
             పతియొనర్చు మంచి సతికి సగము ;
             పతియొనర్చు చెడుగు సతికేల రాదొకో " (3826)

ఒకటే విధమైన రెండుసందర్భములలో నొకటి నిస్సందేహముగా నంగీకరించి, రెండవదానిని మాత్ర మన్యాయమని తలఁచుటకు అసహ్యమా అజ్ఞానమా కారణము? ఈ పద్యములన్నియు అతఁడు బ్రహ్మజ్ఞానము సంపాదింపక మున్ను వ్రాసినవనుకొని తృప్తిపడుదమనుటకు వీలులేదు. దానిని సంపాదించిన తరువాత నేమైన తన యభి ప్రాయమును మార్చుకొని ఆడువారిని గూర్చి 'అయ్యో పాప" మనెనా ? వారి నడతను దిద్ది తత్త్వజ్ఞానము నుపదేశించెనా ? దేశదేశములుఁ దిరిగి యిందఱి కిన్ని బోధనలు చేసినవాఁడు, ప్రపంచమంతయు మగవారిమయమనియే తలఁచినట్లు కానవచ్చుచున్నదే కాని, ఆఁడువారున్నారే, వారు చదువుసంధ్యలు లేక మగవారి కన్న నన్యాయమై పోవుచున్నారే' యని యెవరినైనా దగ్గఱకుఁ బిలిచి శిష్యురాండ్రుగా జేసుకొనెనా ? ఇతని పద్యములన్ని వెదకినను అట్టి మనఃపరిణామ మున్నట్లే కానరాదు. ఒకవేళ వారి సహవాసముచే మరల తాను బతితుఁడైపోవునేమో యని భయపడెననుకొందమా? త్రిమూర్తుల నిల్చితినని చెప్పకొన్నవానికి స్త్రీవ్యక్తి యంతకన్న బలవంతమయ్యెనా? అట్లేని యతని రాజయోగసిద్ధి విలువ