పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

ఉపోద్ఘాతము

యించునంతటి యోర్పు లేకుండును. ఆంధ్రులు కొంత నెమ్మది ననుభవించిన కాలము కాకతీయుల సామ్రాజ్యమందును, విజయనగరపు సా మ్రాజ్యకాలమందును, అందు మొదటి కాలమున వీరశైవమతమును, రెండవకాలమున రామానుజమతమును ఆంధ్రదేశమునఁ బ్రవేశించి నిల్చినవి. కాని యామాత్రము గూడ మతకర్తల మూలమునఁ గాక, వారి యనుయాయులగు మత ప్రచారకుల మూలమున వచ్చి నందువలన, ఆంధ్రజాతియందు పైమతములకు ధృడమైన నిలకడ కలుగలేదు. మొదటినుండియు తత్త్వవిచారమును మతమును ఎక్కువగాఁ పట్టుకొన్నవారు బ్రాహ్మణులు. ఆంధ్ర బ్రాహ్మణులలో మక్కాలుమ్మువ్వీసముము అందఱు అద్వైతులే. వీరందఱును ప్రాయశః దేశాంతరమునుండి వలసవచ్చిచేరి నిలిచిన శాంకరమతాను యాయులు. తెనుఁగు దేశమందలి మాధ్వ రామానుజీయ బ్రాహ్మణు లెవరుగాని నిజమైన యాంధ్రులుగారు. ఇఁక బ్రాహ్మణేతరులలో వీరశైవముగాని వీరవైష్ణవము గాక వేరొకటి నిలువలేదు. భస్మధారణముచేసిస పాపమని గాని, నామాలువేసిన నరకమనిగాని తీవ్రముగా నమ్మిన బ్రాహ్మణేతరు లాంధ్రులలో నెక్కువగాలేరు. కావుననే శ్రీశైలము, ఆహెబిలము తప్ప సుప్రసిద్దమైన శైవవైష్ణవక్షేత్రము లేవియు తెలుఁగు దేశమున లేవు. అందు రెండపది యొప్పటికిని అరవవారి యాజమాన్యమందే యున్నది. శ్రీశైలపు సమాచారము నేనెఱుఁగను. ఇక తిరుపతి మాదనుకొని సంతోషించు తెలుఁగువారు ధన్యులుగాని యదంతయు ఆరవ సామ్రాజ్యమే. అది యట్లండె, చెప్పవచ్చిన దేమసఁగా, ఆంధ్రులలో మత ప్రచారకులందం దపు రూపముగాఁ గలరు గాని మతకర్తలు లేరనుట, ఆ మతప్రచారకులును చాలవఱకును తత్త్వబలముచేఁ గాక తామాశ్రయించిన రాజుల కత్తిబలముచే స్వకార్యమును సాధించిన వారుగానే కానవచ్చుచున్నారు.

వేమన యిందు కొక విధముగా అపవాదమనవచ్చును. తనకుఁ దోఁచిన తత్త్వమును నిర్భయముగా ప్రజల కందకికిని బోధించుటకై ఆంధ్రదేశమంతయు నించుమించుగా తిరిగి, యందందు మఠములను స్థాపించి, తనకు తరువాత తన మతమందు నమ్మికగలవారు కొందఱుండునట్లు చేయగలిగిన తెనుఁగువారిలో నితఁడుముఖ్యుఁడు. బహుశః మొదటివాఁడే కావచ్చును. "ఒకవిధముగా" నని బేరపు మాట యేల చెప్పితిననఁగా, ఇతఁడు బోధించిన మతమున కితఁడు మూలకర్త గాఁడు. అది యనాదిగా హిందువులలో నుండు అద్వైతమతము. కాని దాని నితఁడు అనేకులవలె పుస్తకములనుండి పారాయణము చేయక, యోగ సాధనచే నందలి తత్త్వమును గహించి, నిస్సందేహముగా తా ననుభవించి, తన దేశము వారిని గూడ నట్లు తరింపఁ జేయవలయునను ఉదారాశయముచే ఉపన్యసించుట కుపక్రమించిన వాఁడు. కావననే యితని బోధనలలో జీవమున్నది. ఇతరుల మాటలను గాక తన యనుభవమును నమ్మిన వాఁడగుటచేత, సిద్ధాంతమందలితత్త్వమును కొందఱు సందేహించినను, బోధన లందలి నిష్కపటత్వమును సందేహించు వారు పలువురుండరు. కనుక అట్లు సందేహించుటకు శక్తిలేనివారందఱును వెంటనే యతని మాటలు నమ్మి భక్తులైన శిష్యులౌదురు. అనఁగా, మతకర్తలు కాని మత ప్రచారకులలో మతకర్తల కున్నంత విలువను వ్యాప్తిని కొంతవఱకు సంపాదించు కొనఁగలిగిన ధీరుఁడు వేమన యన్నమాట. ఇతని శిష్యుఁడనఁదగు కటార్లపల్లె వేమన్న, ఏగంటి వారు, పోతలూరి వీరబ్రహ్మము, సదానందయోగి మొదలగువా రనేకులిట్టి మతమునే ప్రచారమునకుఁ దెచ్చినవారు. ప్రాచీనులలో 'శివయోగ