పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
2
వేమన

గొని శబ్దము, అర్థము, భావముఁ గూడ అనువాదము చేయుచు వచ్చిన యాంధ్రులలో ఒక్కనికైన మొన్నటిఱకు అట్టి నాటకములను తెనుఁగున గూడ వ్రాయవలయునను నాశ జనించినట్లే తోఁపకపోవుట మఱియొకటి !

ఈయన్నిటి కంటె విచిత్రమైన విషయము : సుప్రసిద్ధమత స్థాపకు లెవరును ఆంధ్రులైపుట్టి ఆంధ్రదేశమున మత బోధచేయకపోవుట, ప్రాచీన కాలమున - అనఁగా ఉపనిషత్తుల కాలమున - శిష్యులే గురువును వెదకు కొనిపోయి తత్త్వబోధను బొందుచుండిరింతే ; కాని తత్త్వజ్ఞఁడితను లున్నచోటికిఁ బోయి బలవంతముగా నైనను బోధించి మతపుంగపులను తయారుచేయ మొదలిడినవాఁడు. బుద్ధుఁడే కాఁబోలు. వానికి తరువాతివారిలో మొదటివ్యక్తి శంకరాచార్యులు. ఇతఁడు మళయాళమున జనించి, ఆసేతుహిమాచలము సంచరించి, యద్వైత ప్రధానముగా వైదిక మతమును బోధించి, యందందు మఠములను స్థాపించెను. ఇతని ముఖ్యపీఠమైన శృంగగిరి జన్మదేశముసకు సమీపమంచే కన్నడ దేశమందున్నది. కాని యాంధ్రదేశమం దీతనిమఠముగాని, సంచారము చేసినట్లు గుర్తులు గాని కానరావు. రామానుజాచార్యులు ఆరవదేశమందు జనించెను. శంకరాచార్యుల వలె భరతఖండ మంతయు సంచరించి, వైదికమతము భక్తి ప్రధానమైన విశిష్టాద్వైత మని బోధించి, మఠము లందందు స్థాపించెను గాని, యితని కాంధ్రదేశమందు సంచారము చేయునవకాశము లభింపలేదు. మఱి ఆంధ్రులు తన్ను భయపెట్టఁగా కన్నడ దేశమునకు పాఱిపోవలసి వచ్చెను. శుద్ధకర్ణాటకుఁడగు ఆనందతీర్ధాచార్యుల ద్వైతమత వ్యాప్తి కర్ణాట మహారాష్ట్ర దేశములను దాఁటినట్లే కాసరాదు. వీరిపలె వైదిక మతమునే వేఱువేఅు విధముగా బోధించిన నింబార్కాచార్యులును, వల్లభాచార్యులును ఆంధ్రజాతికిఁ చేరినవారైనను వారి మతమంతయు ఆంధ్రదేశము వెలుపలనే యున్నది. ఏ కారణముచేతనైనను స్వదేశము, స్వజాతి వారికి పనికి రాదయ్యెను. ఇ(క బసవేశ్వరుఁడు ఆంధ్రుఁడనుకొనుటలో అమూస మొలత యున్నదో ఆనత్య మంతయున్నది. అతని వ్రాఁతలన్నియు కన్నడమందే కలవు. శ్రీవైష్ణవుల కరవమువలె నేఁటికిని వీరశైవులకు కన్నడ మభిమాన భాష.

ఇట్లగుట కేమి కారణము ? తెలుఁగు వారికి తీవ్రములగు తత్త్వములను విచారించుటకుఁ గావలసిన మేధాశక్తి లేదని చెప్పట సాహసము. వారికి తత్త్వవిచారము లందు రుచిలేదని యూహించుట యన్యాయమగును. మతమనుసది, యొకఁడు తానెఱి(గినది యింకొకనికిఁ జెప్పి, యతఁడు వినకున్న సియిష్టమని వెడలి పోవుట కాక, యొకవ్యక్తి యొకసంఘమునకే తత్త్వమును దెలిపి, దానినాశ్రయించినందుకు గుఱుతుగా వేషము, భాష, ఆచారము మొదలగు వానియందు ఆ సంఘమున కంతయు మార్పును గలిగించునది యగుటచే, సహజముగా స్వాతంత్ర్యరక్తియు, స్వాభిమానమును బలముగాఁగల యాంధ్రజాతిని గొట్టెలమండలవలె నొక మతపు దొడ్డిలోఁ దోలుట కే తత్త్వజ్ఞునికిని సాధ్యముగాక పోయెనేమో ! వివేకానందుఁడు, రామతీర్థస్వామి మొదలగు మహాపురుషు లెన్నియు పన్యాసములిచ్చి యెంతప్రయాస పడినను, స్వతంత్రబుద్ధి బలసిన పాశ్చాత్యజాతి హిందూమతము నాశ్రయింపఁ దలఁపలేదని మనమెఱుఁగుదుము గదా, మఱియు మొదటినుండి రాజకీయ విప్లవములచేతను, ఆంతరంగ బహిరంగ కలహములచేతను, నెమ్మదిని శాంతిని క్రమముగా ననుభవించిన వారు కారు గావున, మసవారికీ తొందఱలే చాలినన్ని యుండుటచేత, పారలే"కిక విషయములను తత్త్వవిషయములను విమర్శించి నిర్ణ