పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన యోగసిద్ధి-మత ప్రచారము 79

అని చెప్పిన సిద్దులలో తక్కిన వెట్లుండినను, నాదశ్రవణము మాత్రము కలిగినది ఆ లయయోగమును దా ననుభవించినాఁడు

       "ఆ. నాదమలరఁ జేసి నాదంబుఁ జొంగించి
            భేదమింతలేక పెనఁగినపుడు
            పాఱు కాల్వవలెను పాఱురా యీనాడు..." (2186)

ఇట్లే షట్చక్రభేదనమగు కుండలీయోగమును గూడ సాధించినాఁడు (3152-56) ఆందులో కడపటి సహస్రారచక్రమును జేరు సాధనలో'

       "ఆ. నిటలదుర్గ మెక్కి నిక్కి చూడంగనె
             కుటిలరూప కళలఁ గూరుఁ నెఱుక." (2222)

అట్లగుటచేత, ఇంకను పూర్తిగా ఆద్వైతానుభవములేక మనసు చలాచలముగా నున్నది గావున, ఆత్మ పరమాత్మల స్వరూపము వేఱు వేఱుగాఁ దెలియఁగోరియు. నది యింకను సాధ్యముగాక.

       "ఆ. నినుఁ జూచెనేని తన్ను తామఱచును
             తన్నుఁ జూచెనేని నిన్ను మఱచు ;
             ఏవిధ్ధమున మనుజుఁ డెఱుఁగు నిన్నును దన్ను?..." (2240)

అని కష్టపడినాఁడు. ఈ సంప్రజ్ఞాత సమాధియందే స్వగుణ స్వరూపము క్రమముగా నట్లు అనుభవమునకు వచ్చునఁట.

       "క. శ్రీ వెలయఁగ సాకారము,
            నావల దీపాకృతియును, నాశిఖలాగున్
            నివార శుకరూపము
            భావన వణువిధము, సగుణభావములై దున్?
                                                     (శివయోగి., 1 అ.)
ఇట్టి తేజోదర్శనము చేమన్నకును గలిగినది.

     "ఆ. కనులు రెంటి నడుమ కాసంత నిలిపిన
           బొమలు మీఱి చూడ్కిఁ బొందఁజేయు,
           క్రమమెఱిఁగి లోన కాంతిని బట్టరా..." (913)

కాని యింతటితో నుండక----

     "ఆ. కనుల చూపు నిలిపి కాంతిని గమనించి
           కాంచవలెను చిత్రకళల దాఁటి..." (910)

ఆనుకొని సాధింపఁగా, భావరూపమైన పైఁజెప్పిన యుపాస్యవస్తువు అభావ స్వరూపముగా మాఱి తుదకు సోహంభావసాధనచే "భావాభావాతీతం' బైన నిర్గుణము అనుభవమునకు వచ్చినది. అది 'వియత్సదృశంబై-అనఁ గా, ఆకాశమువలె బయలై-యుండునఁట. *[1]ఆ బయలంచే బ్రహ్మమున్నదంట

       "ఆ. తెలివి నిలిపిచూడు దీపించు నాకళల్,
             కళలుడుపకచూడు కలుగు బయలు ;
             బయలు నంటిచూడు బ్రహ్మంబు గాంచెదు..." (1963)

కాని యా బయలే బ్రహ్మ యని వేఱొక్కచోట వేమన చెప్పెను—

  1. * శివయో., 1 ఆ