పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 78

వ్రేళ్ళతోఁబట్టి ప్రక్కలకల్లాడించుట ! ఆవు చన్ను పిండినట్లుగా లాఁగుట ! ఇట్లు కృత్రిమముగా నాలుకను పొడిగించుకొని, పైఁ జెప్పిన లంబికావివరములోఁ జొనిపి క్షణార్ధముండినను యోగి విషవ్యాధిమృత్యువులను దప్పించుకొనునఁట!*[1] దీనినే లంబికాయోగమనియు, ఖేచరిముద్రయనియఁ జెప్పదురు. కాని యిది బాహ్యఖేచరి. అంతఃఖేచరి వేఱట. కన్నులు సగము మూసి దృష్టిని నాసాగ్రమందు నిలిపి చూచిన మండలాకారమైన తేజోదర్శనమగును : ఇందు మనఃప్రాణములు లీనముచేసి రెప్పలల్లార్పక చూచునతండు జగద్గురుండగు" ననియు, నదియే నిజమైన ఖేచరియనియుఁ జెప్పదురు ; మరియు

      "మ. ధరణిం గొందఱు నధురూ క్తగతి నంతఃఖేచరీ ముద్రికా
             వరభావం బెఱుఁగంగ నేరకకదా వాలాయమున్ బాహ్య ఖే
             చరియున్ బట్టి నిరూఢసాహస మహాసంరంభ విస్రంభ ని
             ష్టురులై జిహ్వల(గోసి కొం డ్రది ముముక్షుల్ మొత్తురే యిత్తఱిన్!"
                                                                     (శివయో, 4 ఆశ్వా)

లంబికా శివయోగి యొకవేళ నీ యాంతరఖేచరిని తరువాత నెఱిఁగి యాచరించి యుండిన నుండవచ్చును గాని, మొదలితఁడు నాల్కను గోసికొన్న వాఁడే యని యతని పేరే తెల్పుచున్నది. అనఁగా నితనికదే పేరని కాని, అసలా పేరుగల వ్యక్తి యొకఁడుండి వేమన్నకు గురువైనాఁడని కాని కచ్చితముగాఁ జెప్పలేము. మఱి యిటువంటి యోగి యెవనికో యతఁడు శిష్యుఁడైయుండక తప్పదు. కావున వాడుకలో నున్న యతనినే గురువుగా నంగీకరింతము. ఆ గురువవద్ద శిష్యునికిని ప్రప్రథమమందు పై హఠయోగవిద్యలో నుపదేశము జరిగినది. ఇతఁడును నాలుకను గోసికొన్నాఁడు. ఎవఁడో నావంటివాఁడిదంతయు వట్టి బ్రాంతియని తిరస్కరించెను గా(బోలు. వాని నొప్పింపలేక, గురువుగారి యందలి నమ్మకముచేతనో, తన యనుభవముచేతనో దానియందు సందేహములేక యిట్లు ఆక్రోశించినాఁడు :

           "ఖేచరీ ముద్రకు కీలెఱుఁగగ లేక
             వాదులాడునట్టి వారినెల్ల
             త్రొక్కి నాల్కcబట్టి తుదఁ గోయవలయురా !
                       (ఓ. లై., 13-4-16 ; మఱియు, పెక్కు వ్రాఁతప్రతులు)

ఇట్లే పంచాక్షరీ మంత్రము, ద్వాదశాక్షరీ మంత్రము మొదలగు వానిని గూడ నితఁడు కొన్నాళ్ళు జపించినట్లున్నది. 'ముక్తికి(దాఁ దల్లి సుమీ పంచాక్షరీ" యని (వే. సి., 120) యితఁ డన్నాఁడు. తరువాత ప్రాణాయామసాధనకు మొదలిడి నాఁడు. 'ఊఁగి లాగిలాగి యొనరఁగ బిగఁబట్టి పూని గాలి విడిచి" (558) దానిని సాధించినాఁడు. ఆ సందర్పమున నితనికి

        "క, భువి పొందుటుడిగి దూర
             శ్రవణంబును దూరగమన జవమును, నమృత
             స్రవమును, సుదూరదృష్టియు,
             సవిరళ నాదశ్రవణము నగు మోదమునన్"
                                                    (శివయో., 3 ఆశ్వా.)

  1. * చూ. హఠయో. 3, ఉప, ప. 32 నుండి 50 వరకు.