పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

వేమన

మును ప్రధానములు గావున, దానికిఁ గావలసిన పుష్టాహారములు ఎక్కువ కష్టము లేక సంపాదించుటకును, ఆయుర్వేదముప్రకారము న్వర్ణమును భస్మాదిరూపముల చేత నిత్యమును సేవించుట చాలమంచిది గావున దానికిని, సహజమైన బంగారు దొరకుట కష్టమై, కృత్రిమముగా తయారుచేయవలసిన యక్కర వారి కేర్పడి యుండును. కాని కృత్రిమమైన బంగారునకు సహజమైనదాని గుణములుండునా యను ప్రశ్న కలుగును. చూచినవారు ఉపయోగించినవారు ఎవరైన దీని కుత్తర మీయవలయునే కాని నే నెఱుఁగను.

వేమన బీదరికమును బోఁగొట్టుకొనుటకై బంగారు తయారుచేయు విద్య నేర్వఁగోరి వీరి నాశ్రయించియుండునని యూహించితిమి, వారా విద్యను సామాన్యముగ నెవరికినిఁ జెప్పరు.

               “దాతవ్యం గురుభక్తాయ నదద్యాద్దుష్టమానసే"
               "వనితాపత్రమిత్రాదిగోప్యం సిద్దిప్రదాయకమ్”[1]

అని వారు భావించిరి. అనేక నందర్భములలో నిట్లు విషయములను గుప్తములుగా నుంచుట, తమ కొకవిధమైన విలువను, గౌరవమును సంపాదించుకొనుటకే కాని, వేఱుకాదు. ఈవిషయము ప్రాచీనులే యంగీకరించిరి. చూడుఁడు-హఠయోగులకు, దేహము లోపలిభాగమును శోధించు భౌతి, నౌళి మొదలగు కర్మము లాఱుగలవు.

               'కర్మషట్కనిందం గోప్యం మఠశోధన కారకమ్'
                                                                   (హఠప్రదీపిక, ద్వితీయోపదేశము, 23 ప.)

అని పై కసరత్తులుగూడ రహన్యముగ నుంచవలెనని శాసనము గలదు. పై శ్లోకమునకు వ్యాఖ్యచేయుచు బ్రహ్మానందయోగి—

              “గోపనాభావే షట్కర్మకమన్యైరపి విహితంస్యాదితి యోగినః పూజ్యత్వాభావః
               ప్రనజ్యే తేదిభావ:" (గుప్తముగా నుంచనియెడల నీకర్మము లందఱును జేయఁగల్లుదురు గావున, యోగికి పూజ్యత లేకపోవునని భావము).

అని వ్రాయుచున్నాడు. ఎట్లను స్వర్ణవాదమువంటి విలువగల విద్యలను రహస్యముగా నుంచుట మనుష్యస్వభావము. ఇట్టిదానిని సంపాదించుటకై వేమన్న చాల గురుసేవ చేసియుండును. వారును 'గోప్యం గోప్యం మహాగోప్యం' అని యెన్నో బాసలు చేయించుకొని యితనికేదో కొంత తెలిపియుందురు. ఇంత కష్టపడి తాను సాధించిన విద్యను స్పష్టముగా బహిరంగపఱుప నిష్టములేక కాఁబోలు, ఇతఁడును, ఈ విద్యనుగూర్చిన పద్యములన్నియు ఇతర వాదగ్రంథములందలి పద్యములవలెనే, స్పష్టముగాక చేసినాఁడు.

ఇట్లు బంగారమును సాధించు నాశకుతోడు తీవ్రమైన తత్త్వజిజ్ఞాన గలవాఁ డగుటచే, వేమన పైవారిని సేవచేయునప్పడు వారి నడతలను చక్కఁగా గమనించి యుండును. సంసారులకును, వారికిని గల భేదములు చూచి యాశర్యపడి యుండును. వారికి అడవి, యూరు, పగలు, రాతి యను భేదములేదు ; ఆహారమునకై యీ వస్తువులు కావలెనని, కాని యీ కాలమునఁ గావలెనని కాని నియమము గానరాదు ; ఉపవాసములకు వెఱువరు ; రోగాద్యుపద్రవములు వారిని

  1. *గురుభక్తన కీ విద్య చెప్పవలయును. దుష్టమనస్సు గలవావికి చెప్పరాదు. భార్య, పుత్రులు, మిత్రులు మొదలగువారికివి దీనిని దెలువక గుప్తముగా నుంచిన సిద్ధించును (దత్తాత్రేయతంత్రము,పే.116)