పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
                   వేమన కాలమందలి మతధర్మముల స్థితి    69

రెండుగాఁ బరిణమించును. లింగము పూజ్యదేవత ; రు!దరూపము. అంగము జీవాత్మ. 'శక్తి'గూడ 'కళ"యని, 'భ క్తియని రెండు తెఱఁగులిగును! కళ శివునియం దుండి సృష్టికిని, సంసారమునకును కారణమగును. భ_క్తి జీవనియందుండి ముక్తి హేతుపగును. ఇట్టి యవిచ్చిన్న భక్తిచే జీవనికి శివునితోడి 'సామరస్యము', అనఁగా, ఆనందమయమైన ఐక్యము, కలుగును. అదే ముక్తి, కాని యీ యైక్యము శాంకరాద్వైతుల యైక్యమువలె జీవనికి సంపూర్ణముగా ఆత్మనాశము గలిగించి పరబ్రహ్మతో నేకీభవింపఁజేయదు, జీవనికి తా నానందమనుభవించుచున్నానను జ్ఞానము గలదు* [1]. వైష్ణవాద్వైతులవలె వేజుగా నుండక, పాలలో నీరు చేరినట్లు గాఁబోలు, శివునితో సాయుజ్యమునందును దీని కఖండభ క్తిసాధనము ఆవశ్యకము గావస, అందుకు వారికి యోగసాహాయ్యము తప్పనిది. ఇట్టి యుద్వైతము నభ్య సించువారు శివయోగు లస(బడిరి. తక్కిస యోగులు వట్టి యోగులు.

శంకరాద్వైతము బ్రాహ్మణజాతియందే వ్యాప్తిఁగాంచినది. బ్రాహ్మణులలో ననేకులు ఇప్పటికిని శాంకరులే. కాని వారియందు యోగవిద్య వ్యాప్తిఁగాంచలేదు. అద్వైతము సిద్ధాంతమందే కాని, వారి వ్యవహారమందు లేదని చెప్పితిని. ఇదిగాక అనూచానముగా జాతిసిద్ధమై వచ్చిన వైదిక కర్మానుష్టానమును వదలుట వారికి సాధ్యముకాలేదు; బ్రహ్మజ్ఞానము సంపూర్ణముగఁ గలిగి విరక్తుఁడైనవానికి తప్ప తక్కినవారికి కర్మత్యాగమును సంపు మనుమతింపలేదు. కర్మత్యాగము, సంసార విరక్తియుఁ గలవారికి తప్ప యోగాభ్యాసము సాధ్యముగాదు. సన్న్యాసాశ్రమమును స్వీకరించినవారికిని సంఘముపై నధికారము, మతముల యాజమాన్యము మొదలగునవే కాక, త్రికాలపూజ, అభిషేకములు, నమారాధనలు, మెరవణులు మొదలగు సన్న్యాసధర్మములు ఇంటికర్మములకన్న నధికములైనవి. కావననే ఆద్వైత బ్రాహ్మణులలో యోగు లపరూపమైనారు. ఎట్లును కర్మభూమియగు దక్షిణ చేశములో వా రరుదు.

ఇఁక వీరశైవము బ్రాహ్మణప్రాబల్యము సణఁచుటకై పట్టిన మతము. ఈ మతము నాశ్రయించుట కంజీఖును ఆర్డులు. బ్రాహ్మణులలో నున్నన్ని నిత్య కర్మముల గలాటా వారిలో లేదు. మనలోవలె వారిలోను మఠములలో నధికారము వహించిన కర్మఠసన్న్యాసులున్నారుగాని, సామాన్యజాతులగుంపే බං" ටිජ්” සපඤrටර්ථ చేతను, అద్వైతులలోవలె నిర్గువోపాసన చేయకున్నను నగుణోపాసనచేతనే కాల క్రమమున బ్రహ్మానుభవము సిద్ధింపగలఁదను అనుకూలము లేదు గనుక భక్తి యఖండముగా లేక మోక్షము సిద్ధింపదు గావునను వారిలో తప్పక యోగవిద్య ననేకు లాశ్రయింపవలసివచ్చినది. యోగమును పూర్తిగా సాధింపఁగల్గినవా రనేకులు లేకపోవచ్చును గాని, సాధింపఁ బ్రయత్నించినవారు తక్కిస మతములకన్న నా మతములో నెక్కువ గలరని తలఁచుచున్నాను.

ఇట్టి శివయోగులలో కొందఱూళృయందు, మఠములలోనో, గృహస్తులుగానో వసించియుండినను, అనేకులు ఆలుబిడ్డలులేని బ్రహ్మచారులై అడవులలోనో, కొండల యందో వసింతురు, న్వర్ణవాదవిద్య వీరిలో చాలమంది యెఱుఁగుదురను ప్రతీతి గలదు. విరక్తులై యోగాభ్యాసులైనవారి కీ కృత్రిమస్వర్ణమం దాశ యేల కల్గినదని మన కాశ్చర్యము గలుగును. ప్రాయశః హఠయోగసాధనకు దేహశక్తియు నారోగ్య

 1. * Vide Bhandarkar’s Saivism, p. 134 to 137.