పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
16
వేమన

వ్రాసినవని నేను నమ్మఁజాల కున్నాను. వేమనయందుఁ గల సంగ్రహశక్తి, భావమును స్పష్టముగా చదరముగా కత్తిరించినట్లు చెక్కి యతికించుశక్తి మొదలగు గుణము లేవియు ఇందుఁ గాన రావు. ఒకటి విని మీరే నిర్ణయింపఁడు

"పూర్ణ సమాధిలో రేచించి పూరించి కుంభించి- పెద్ద గాలివలెనే బరగుచుండు-యేడుకోట్ల వెట్టనాచంబులు గానబడును—మేను చల్లనిగాలి విసరును - గాలి లోపలనుండును గంధర్వనాదంబు-గానపడు వినుబాటలో నుండు (?) ఎంతైన నడువీధి నాడుచుండు"-ఇత్యాది. (చూ, పుటనోధని, పు. 50).

ఇవి కృత్రిమములనుటకు ఇంకొక సాక్ష్యము గలదు. 1వ వాక్యమం దీపద్య గంధి వాక్యముఁ జూడుఁడు.

"అది మూలమందు అంబికా శివయోగి-మూలగురుఁడు మాకు ముక్తి జూపె? " వేమనకు గురువని చెప్పఁబడినవాఁడు లంబికాశివయోగి గాని అంబికా శివయోగి గాఁడు. వట్టి శివయోగులున్నారుగాని ఆంబికా శిపయోగులను నే నెఱుఁగను. ఇందలి పద్యపు నడకకు సహజమైన యతినిబట్టి అంబికా శివయోగి యనియే వ్రాసిన వాని యభిప్రాయమనుటలో సందేహములేదు గదా! ఆంబికాశివయోగి పదమున కర్ధము ముందు విన్నవింతును. తెనుఁగు వ్రాఁతలోని ఆకార లకారములకుఁగల సామీప్యమే యీ బ్రాంతికిఁ గారణము. కాబట్టి పైరెండు శబ్దములకుఁ గల యర్థ భేద మెఱుఁగనివాఁడు, యోగశాస్త్ర శబ్దముల నెవరివలననో విన్నవాఁడు,అనుభవము లేనివాఁడు-ఎవఁడో పైవాక్యములను వ్రాసి వేమన తల కంటఁగట్టి నాఁడని సందేహించుటలో తప్పులేదు.

ఇట్లే బందరువారి ముద్రణములోను కొన్ని వచనములు గలవు. అవియును అందందు పద్యపునడక గలిగి తుచలో వేమ శబ్దముతో ముగియును. వేమనవి కావని సందేహింపవలసిన వానిలో నివియును జేరిసవి.

పై చర్చవలన వేమన పద్యములను శ్రద్ధతోఁ జదువువారికిఁ గలుగు చిక్కులు కొంతవఱకు స్పష్టమగును. సరియైన విమర్శముతోఁ జేసిన ముద్రణము ఒకటైనను ఈవఱకుఁ బ్రెలుపడలేదు. వేమన్న పద్యము లిట్లున్న మేలని తల(చిన వారే కాని, యెట్లుండి యుండవచ్చునని విమర్శించిన వారులేరు. అర్థము తెలియని వారు, ఆర్థములేని సంప్రదాయములకుఁ జేరినవారు, అనర్ధకరమగు అభిమానము గలవారు-ఈ పద్యములను తలయొక దిక్కుగా నీడ్చి చెఱచినారు. ఇతరుల భావములును రచనలును మనకెంత యసహ్యముగానున్నను వానిని తిద్దునధికారము మనకు లేదని తలఁచుట మనవా రనేకు లింకను నేర్వనివిద్య, కావననే, అందందు కొన్ని యనావశ్యకమైన సవరణలున్నను, చిన్నదైనను, ఇప్పటికిని బ్రౌను దొర ముద్రణమే సర్వోత్తమ మని చెప్పటకు సిగ్గగుచున్నది. అతఁడు మనకుఁ జేసిన మహెూపకారమును నే నరగంట చూచుచున్నానని తలఁపకుఁడు. చెన్నపట్టణములోని ప్రాచ్యపుస్తకశాలలోని వ్రాతప్రతుల నొకమాఱైనను చూచిన వారికి తప్ప తక్కినవారి కామహనీయుని "యప్పు తెలియదు. కాని యతఁడు దోసిలి నిండఁ "బెట్టినను, పెట్టిన దెంతమంచి వస్తువైసను, అది బిచ్చమే. ఆతని యౌదార్యమున కతనిని పొగడుదము కాని మన దారిద్ర్యమునకు సిగ్గుపడపలదా ? ఇందఱు తిండికి దండుగ తెలుఁగు వారుండి వేమన వంటివాని విషయమై కూడ ఇంకను తెల్లదొరగారి తిరిపెమునకే యొుడిఁ బట్టవలసినందు కేడ్వవలదా ? ఆంధ్ర మహా పురుషులందఱి తోడ వేమన్నకును యూనివర్సిటీ కుర్చీలపై సమానముగాఁ