పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                           ఉపోద్ఘాతము       17

గూర్చుండఁ జోటిచ్చి ధన్యులైన ధీరులు ఆంధ్ర విశ్వకళా పరిషత్తువారు. వారు ఇంకఁ గొంత యౌదార్యము వహించి, వ్రాఁత ప్రతులను ప్రాఁత యచ్చుప్రతులను సేకరించి, సంప్రతించి, సవిమర్శముగా వేమన్న పద్యముల నూతన ముద్రణ మొకటిచేసి పుణ్యము గట్టుకొందురుగాక ! సామాన్యు లొకరిద్దఱితో ఆ కార్యము సాధ్యము కాదు గావున నా భారము ప్రకృతము వారినే చెందియున్నది.