పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

వేమన

దోcచిన భావములను మఱుగు పఱుచుకొనలేక బైటఁ బెట్టు వేమనవంటి తీటనాలుక వాని కవిత్వమునందు, అతని శైలీ స్వరూపము నిర్ణయించుటకు అర్ధభావముల కంటె, ఛందోగతి, యతి విశేషము, పదములకూర్పు మొదలగు బహిరంగములే యొక్కువ పనికి వచ్చుననుట నామసవి. ఈ దృష్టితో చూడఁగల్గితి మేని, ప్రక్షిప్త పద్యముల సంఖ్యను నికరముగా, చరిత్రకారుల పటకారులకు చిక్కునట్లు, చెప్పి చూపలేకున్నను, స్థూలముగానైనను తెలియఁగలము. ప్రకృత మింతకన్న నెక్కువ చేయలేము. నే నిందుదాహరించు పద్యములనెల్ల ప్రాయికముగ నిట్టి దృష్టి చేతనే చూచి నిర్ణయింపఁ బ్రయత్నింతును.

ఇట్లే మూలపాఠమును గుర్తింపవలసి యున్నది. ఇది వఱకును సామాస్య ముగ సవరించినవారు తమకు రుచియైన పాఠమును గ్రహించుట యలవాటైనది. అందేదియు రుచింపని యెడల, అర్థము కాకున్న, స్వేచ్చగా దిద్దుటయు వాడుక యైనదని మొదలే విన్నవించితిని గదా. ఇవి యొకటికంటేనింకొకటి యన్యాయమని చెప్పఁబనిలేదు. మనరుచి వేమన్నకుండవలెనని యూహించుట పొరఁబాటు. మన కర్థము కాని దానిని కాలేదని యంగీకరించిన నవమానమని తలంచుట యంతకంటే పొరఁబాటు. ఇదివఱకు బైలుపడిన తెలుఁగు గ్రంథములు శోధించిన వారనేకులు ఈయవస్థపాలైన వారే. ఇట్టి పరిశోధకుల పిలువని పేరంటమునుండి మూలమును విడ(దీయవలయునన్న వ్రాఁతప్రతులే శరణ్యము. వేమనపద్యములు వ్రాసినవారు ఎక్కువ చదువరులుగారు గావున వారివి కలము పొరఁబాట్లే కాని కవిత్వపు పొరఁ బాట్లెక్కువ యుండవు. ఈ పద్యము వినుఁడు -

        "ఆ, ఇహమునందు సుఖము ఇంపారకుండిన
              పరమసందు నెట్లు పడయ వచ్చు
              మొదట లేని చేవ తుద నెట్లు కల్లురా,విశ్వ."

ఇందలి 'చేవ' పదమును వ్రాఁతగాండ్రు, ' చాప ' వ్రాసిరి. సామాన్య జనుల పద్ధతి ప్రకారము ఇందలి చకారము తాలవ్యముగా నుచ్చరింపఁబడుచుండెను. చదువుకొన్న శోధకుఁ డొకఁడు బాలవ్యాకరణ ప్రకారము " చాప" యని దంత్యము గా దాని నుచ్చరించి యర్ధము గాక, 'చావు' అని యుండవలెనని తీర్మానించెను. ఒకానొకరు దానికి విచిత్రముగా వ్యాఖ్యానము గూడ చేసిరి! (చూ. వేదాంత సిద్ధాంతము, పే. 23) ఇంకఁ గొందఱు 'చేవ" యను వ్రాఁతలోని 'వ' కారమును ' త' కారముగా చదువుకొని ' చేఁత' యనుకొనిరి. ఈ గందరగోళమేలయని యింకఁ గొందఱు ఆ స్థానమందు ' సుఖము' అని మార్పుచేసిరి. వీనిలో ' చావు'ను మాత్రము వదలి బందరువారు, చేత, చేప, సుఖము మూఁడును దీసికొని మూఁడు వేఱువేఱు పద్యములుగా ముద్రించిరి! (వే. సూ, పే. 32) విమర్శకులు పరిశోధకులుగా నేర్పడని యవస్థయిదీ. వ్రాఁతప్రతులను నవిమర్శముగా పరీక్షించితిమేని యీ కష్టము చాలవఱకు నివారణయగును.

ఇ(క ఆర్థమును గూర్చిన కష్టమునకు వారివారి స్వశక్తితప్ప వేఱుశరణము లేదు. వేమన పద్యములలో కొన్నిటికి వ్యాఖ్యవ్రాసినవారు నేనెఱిఁగినంత వఱకును ఐదుగురు గలరు. వీనిలో (1) బరంపురమునందలి శ్రీతారకబ్రహ్మానుభవి పూడిపెద్ది సాంబశివరావుగారు "శ్రుత్యు క్త్యనుభవములతో, రచించిన "వేమన పద్యరహస్యార్థ తాత్పర్య బోధిని". ఇదిగాక, వీరు "వేమన జ్ఞానపంచపద్యరత్నములు', 'హేమతారక విద్య','వేమనార్యునివా క్యార్థానుభవశిరోమణి', 'గగనవిద్య మొదలగుగ్రంథములు,