పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                          ఉపోద్ఘాతము.     11

     "మ.II తిలలం దైలము, పాలవెన్న, శిలలం దెల్లంబుగా లోహ ము
             జ్జ్వల దీపాంకురమందు కజ్ఞలము, కాష్ణశ్రేణియందగ్ని భూ
             తల ఖాతంబున నీరు గల్లుటయుఁ దద్యంబంచు నూహించి తాఁ
             దలఁపన్ యత్నము సేయకున్నఁ దగునే ధర్మంబు వేమాహ్వయా,”

                           (వేదాంత సిద్ధాంతము, పే. 108) 
        " ఇనుమునఁ జేసిన మైనపు కడ్డి, 
         ఇంటి వెనుక నఱ్ఱావుల దొడ్డి, 
         అవిటికి మేపిన కుందురు గడ్డి (?)
         విప్పిచెప్పరా వేమారెడ్డి." (ఓ. లై., 13 - 9 - 19) 

</poem> రెండును వేమన పేరనే యున్నవి. కాని సహృదయ(డెవ్వడుఁగాని రెండును ఒకఁడే వ్రాసినవనలేఁడు. వ్రాసి యుండిన రెండవది వేమన వ్రాసి యుండవచ్చు నేమో. వేమనకై వాడము మొదటి దానియందు శూన్యము : భారతశయ్య, రెండవదానియందు కొంచెము వేమన్న వాసన యున్నది. మఱియు,

      " ఉ. వాసనలేని పూవు, బుధవర్గములేని పరంబు, చాల వి
             శ్వాసములేని భార్య, గుణవంతుఁడు గాని కుమారుఁడున్, సదా
             భ్యాసము లేని విద్య, పరిహాసములేని ప్రసంగ వాక్యమున్,
             గ్రాసములేని ప్రాపు కొఱ గాదయ భూమిని వెఱ్ఱివేమనా "
                                                    (వేదాంత సిద్ధాంతము, పే. 107)

ఈపద్యము 'కొఱగానివి పెమ్మయసింగ ధీమణి' యను మార్పుతో జక్కన చెప్పిన " పెమ్మయ ధీమణి శతకము' లోని దని, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రలుగారు 'చాటు పద్య మణిమంజరి"లో (బ్రకటించిరి (చా.ప.పే. 102). 'నుమతి శతకము', 'తిరుమ లేశుని పద్యములు" మొదలగు వానిలోనివి గూడ వేమన్న పేరున ప్రకటింపఁబడినవి. ఇట్టివెన్ని కలవో !

వేమన పద్యములందలి ప్రక్షేపములను నిర్ణయించుటలో అర్ధభావములకన్న పద్యరచనా స్వరూపము ముఖ్యముగా గమనింపవలెనని నా యభిప్రాయము. ఎందు కనఁగా 1 మేమనకు విరుద్ధము కాని యర్ధభావములను ఇతరులును జేర్పవచ్చును : వేమనయే సహజమైన స్వాచ్చంద్యముచేతనో, సన్నివేశము, వయస్సు, అనుభవము మొదలగు వాని భేదముచేతనో, తానాడిన వానికి విరుద్ధములైన భౌవములు తానే యాడవచ్చును. కాని, ప్రకృతి సిద్ధమైన శైలీవిశేషమును అతఁడు మార్చుకోలేఁడు; ఇతరు లనువాదము చేయలేరు. శైలి కర్త యొక్క ముఖమువంటిది. అంతరంగ మెంత మాఱినను అది మాఱదు. కారణాంతరములచేఁ గొంతమాఱినను స్వత్వమును పూర్తిగాఁ బో(గొట్టుకొనఁ జాలదు. కావననే ఒక వస్తువు నొకచోటఁ బొగడి వేరొకచోట దానిని ఖండించినాఁడన్న మాత్రాన, పై రెండు పద్యములలో నొకటి యతనిది గాదని నిర్ణయించుట సాహసమని నేను తలఁచుచున్నాను. మఱి యిప్పడు వేమన్న పేరనున్న పద్యములన్నియుఁ జదువఁగా, నందులో విశేష భాగము వేమన్నదనుటలో సందేహముండదు గావున, అందువలన వేమన శైలీ స్వరూపము దృడముగా భావము నందేర్పఱుచుకొని తద్విరుద్ధములైనవి యతనివి కావని నిశ్చయించుట సహృదయునకు అసాధ్య కార్యము కానేరదు. అనఁగా, ఆర్థ భావములు పూర్తిగా వదలవలేనని కాదు. అది యసాధ్యము. కాని, ఒక యుద్దేశముతో ఆద్యంతములుగల గ్రంథము వ్రాయక సమయము వచ్చినప్పడు హృదయమునఁ