పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                    వేమన వంటివారు  101

         "ఆ. బందెతాళ్ళదెచ్చి బంధించి కట్టఁగ
              లింగఁడేమి దొంగిలించినాఁడా ?
              ఆత్మలింగమునకు నర్చింపనేరరో?" (2685)

       (2) "ఒడల దండిసి ముక్తిపడెవె నెంబుప హెడ్డ
               బడిగెయలి హత్త హెుడియలడగిహ సర్ప
               మడియువదె హేళు; సర్వజ్ఞ" (510)

         "ఆ. ఒడలు బడలఁజేసి యోగులమనువారు
               మనను కల్మషంబు మాన్పలేరు
               పుట్టమీఁదఁ గొట్ట భుజగంబు చచ్చునా?..." (806)

       (3) "కొట్టు బహ కాలదలి కొట్టుణలి కరియదే
               హుట్టియ ఒళగె జేనిక్కి, పరరింగె కొట్టు హెూదంతె నర్వజ్ఞ." (605)

         "ఆ. ధనముఁ గూడఁబెట్టి ధర్మంబు సేయక
               తాను లెన్సదినక దాcచు లోభి ;
               తేనె నీగగూర్చి తెరువరికియ్యదా?..." (2107)

       (4) "కల్లుప్పు కర్పురవు సొల్లెరడు ధాతొందు,
               ఖుల్ల నొళ్ళిదన రూపొందు, గుణదొళగె,
               ఎల్ల అంతరపు సర్వజ్ఞ." (727)

         "ఆ, ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు
               చూడఁ జూడ రుచుల జాడ వేఱు
               పురుషులందు పుణ్యపురుషులు వేఱయా.. " (534)

ఇట్టి వింకనుగలవు. ఈపోలికలు కేవలమాకస్మికములేనా, లేక యొకరినింకొ కరుచూసి వ్రాయుటచేఁగల్గినవా యను చర్చకుఁ జేయివేసి ఫలములేదు. అసలిరువురి కాలము స్పష్టముగా నిర్ణీతము గాలేదు. కావున ఇరువురిలో నెవరు మొదలుండిరో చెప్పలేము. ఉత్తంగి చెన్నప్పగారు భావించునట్లు సర్వజ్ఞుఁడు పదునాఱవ శతాబ్దము వాఁడై, వేమన మనము తలఁచినట్లు పదునేడవ శతకపు తుదిలోనివాఁడే యైనచో వేమనయే యితని ననుసరించె నసవచ్చును. కాని వేమన్న కన్నడదేశమునకు సమీప మందున్నవాఁడైనను, తెనుఁగుదేశమందును ఆరవదేశమందును తిరిగినట్లు కాన వచ్చుచున్నదే కాని, కన్నడుల సహవాసమతనికి లభించెనని స్పష్టముగాఁ జెప్ప వీలులేదు. తెలుఁగుదేశమున సర్వజ్ఞుని పదములకు వ్యాప్తి కానరాదు గాని, యతఁడు ఇందు కొంత సంచరించినట్లున్నది. తెలుఁగువారి నితఁడు తిట్టి వ్రాసిన పద్యములు గలవు (1254-55). శ్రీరాములు లంకను జయించిన తరువాత లంకలోని స్త్రీలకును కిష్కింధాపట్టణపు పురుషులకును జరిగిన సంఘసంస్కార వివాహముల ఫలము తెలుఁగువారని యితని మనుష్యశాస్త్ర సిద్ధాంతము (1255)! మఱియు, కన్నడదేశమందు వలసపోయి నిలిచిన యాంధ్రు లనేకులు గలరు. ములకనాటి బ్రాహ్మణులు, కోమట్లు, మంగలివారు, భట్టురాజులు మొదలగు తెలుఁగువా రనేకులు మైసూరు సీమలో నిప్పుడును గలరు. కాని కన్నడు లాంధ్ర దేశమందు చాల తక్కువ. కావుననే వేమన పద్యములకు కన్నడసీమలో కొంత ప్రచారము గలదు. కనుక వేమన్న వాసనయే సర్వజ్ఞునకుఁ దగిలియుండునా యను సందేహమగూడ గలుగవచ్చును. కాని యింతకన్న నెక్కువ దూరము ఈ