పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                          వేమన    100

గూర్చి కలఁతలు పెట్టుకొనక, దొరికినది తిని దొరకకున్న నూరకుండి, యే యింటి పంచనో యే చెట్టుక్రిందనో పరుండి, యెప్పడును శివధ్యానానంద మనుభవించుచు, చావు వచ్చినపుడు నంతోషముగా లేచిపోవ సిద్ధముగా నుండవలసినదే కాని, సంసారమునఁబడి ఆలుబిడ్డల పంచనుండిన కైలాసము లభింపదనియే నర్వజ్ఞుఁడు తలఁచెను. వేమనవలెనే యితనికిని అడవుల కొండలఁ బడియుండుట యసహ్యము. మనసులో ధ్యానించువానికి ఇల్లు, మఠము, అడవి, కొండ అన్నియు నొకటే యనియు, అదిలేని వాఁడు దేవళము గర్భగుడి'లో నున్నను, కొండ కొననున్నను ఒకటియే యనియు నితఁడన్నాఁడు (247). ఇతఁడు తన జీవితము నిట్లే కడపె ననుటలో నందేహము లేదు. కాని యంతకన్న నెక్కువ తెలియదు.

వేమన వలెనే యితఁడును వ్రాలకందక వేలనంఖ్యగా పద్యములు చెప్పిన వాఁడు. సమయము దొరకినప్పడెల్ల మాటలకు బదులుగా పాటలే యుపయోగించిన వాఁడు. ఈవిషయ మావిషయ మనకుండ దొరకినదానిపైనెల్ల పదము లల్లిపారవేసిన వాఁడు. ఇట్లు అట్లు అనక వచ్చినట్లెల్ల వాగిననోరితనిదిగూడ, శబ్దములు సహ్య ములు కాకపోవచ్చును; అర్ధమన్యాయం గావచ్చును ; కాని అశక్తి మాటలు, అంటని భావములు ఇతనినోటినుండి వెడలవు. వేమన వలెనే యితఁడును దేశ సంచారముచేసి తనకుఁ దెలిసిన తత్త్వనీతి ధర్మములను ప్రాస్తావికముగా ప్రజలకు బోధించిన వాఁడే, కాని యతనికన్న నితనికి లౌకిక మొక్కువ. తన మాటలు వినని మూరఖులనతఁడు ఎద్దులని, గులాములని, గాడ్దెలని చెడఁదిట్టినవాఁడు. ఇతఁడును అట్టి కుందేటికాళ్ళ వాదమువారి నెదుర్కొనక పోలేదు. కాని వారితో కలహించుట కిష్టములేదు : ఫలములేదు గావున, వారిని గూర్చి యితఁడే మన్నాఁడో వినుఁడు.

              "నెలవన్ను ముగిలన్ను హెలివరుంటెందరే
               హెలివరు హెలివరెన బేకు ; మూర్ధనలి
               కలహవే బేడ సర్వజ్ఞ." (940)

(భూమిని ఆకాశమును చేర్చి కుట్టఁగలవారున్నారనిన, కుట్టఁగలరు కుట్టఁగల రనవలెను, మూర్థులతో కలహమేవలదు); కావున * మూర్ఖను అందంతె అన్ని' : "మూర్ఖుఁడు చెప్పినట్లు చెప్పఁడు" అని యితఁడు బోధించెను (943).

తొడకులేని ధారాళమైన శయ్య, అందఱికిని అర్థమగు భాష, ఎల్లరు అనుభ వించి యెఱింగిన యుపమానములు, మఱుఁగులేని మాటలు, నవి నవ్వించు హాస్యము—ఇవి ఇతని కవిత్వమందును ముఖ్యతత్వములు. జ్యోతిషము, వైద్యము, శకున శాస్త్రము, కామశాస్త్రము—మొదలగువాని యందితనికి వేమన కంటె నెక్కువ ప్రవేశము గలదు. రసవాదమందును అతనికున్నంత నమ్మికయు ననుభవమును గలదు. అసభ్య విషయముల నిరువురికిని ఎగ్గులేదు. ఇరువురును అర్థముగాని 'కూట పద్యములను అందందు వ్రాసినవారే. ఇట్లు, స్వభావము నందలి యల్పభేదముచేత దృష్టిలోను ఇరువురికిని కొంత భేదముగానవచ్చినను, మొత్తముమీఁద ఇరువురును ఒకరినొకరు తీర్చిన ప్రతిమ లనవచ్చును.

ఇదిగాక యిరువురును ఒకరితోనొకరు మాటలాడుకొని వ్రాసినట్లున్న పద్య ములు కొన్నిగలవు. చూడుఁడు(1)

     (1) "కట్టలూబిడలు శివ బట్టలవ కద్దనే ?
              కట్టలూ బేడ ; బిడబేడ; కణ్మనవ కట్టిదరె సాకు సర్వజ్ఞ." (148)