పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కాల దేశములు 27

రించినవాఁడైనను తక్కిన స్థలములకంటె నిక్కడ కొన్నాళ్ళేకువగ నిలిచి యుండఁ డేని, ఆతని పద్యములను వినుట మాత్రమేకాక యతని యోగసిద్దులు రసవాదము మొదలగు మహత్త్వములు ఆందఱు నెఱిఁగియుండరేని, తుంగ పుల్లారెడ్డి 'నా పేరు పుల్లారెడ్డి కాదురా, వేమన' యని చెప్పినవెంటనే నమ్మట యట్లుండఁగా 'వీనికేమి వచ్చెరా నడివయసులో నామకరణము !" అని పరిహసించి యుందురు. ఇదిగాక వేఱొక సాధనము గలదు. వేమన సూక్తిరత్నాకరములో క్రింది పద్యము గలదు.

        " ఆ. కదలి తూర్పు సందు ఘనత శోభిల్లగా
               బరగు వర కఠార్లపల్లె వెలసి
               యచలనిష్టఁగూడ సమరి యుండెదరయా విశ్వ." (887)

ఈ పద్యము వేమన్నది కాకపోవచ్చును. తుంగ వేమన్న శతకమునందును గానరాలేదు. నేను చూచిన తక్కిన ప్రాతప్రతులలోను లేదు. కాని యచ్చువేసిన వారు కృత్రిమముగా తయారుచేసినది మాత్రము గాదు. వారికి "కదిరి తూర్పునందు' అను పాఠముండపలయునని తెలియదు. 'కదలి' యనియే పాఠమున్నఁ దప్పేమి యందురా, తూర్పునందు కటార్లపల్లె యునఁగా నే యూరికి తూర్పున? ఆంధ్ర దేశమునకు కటార్లపల్లె సుమారు దక్షిణమగును. అక్కడివారు తెనుఁగుదేశమును తూర్పుదేశమందురు, కదిరికి కటార్లపల్లె తూర్పున నున్నది. కాపన "కదిరి' గ్రామ జ్ఞానములేని వ్రాఁతకాఁడెవఁడో తిద్ధి వ్రాసుకొన్న పాఠమిది. లేక కదిరిపద మర్ధము గాక సంపాదకులే తిద్ధియుందురు. చెప్పవచ్చిన దేమనcగా, పై పద్యము బందరు వారి యచ్చుప్రతికంటె ప్రాఁతది, అందులో వేమన కటార్లపల్లెలో వెలసియున్నట్లు స్పష్టమగుచున్నది. కావున పూర్వకాలమందును దీని నమ్మినవారు కొందఱుండి రన వచ్చును. కాని యతఁ డిక్కడనే సమాధియైనాఁడని చెప్పట కేసాధనమును ఇదివఱకులేదు. వాడుకయైనను గానరాదు. మీఁదుమిక్కిలి, కడపజిల్లా సామూరు గ్రామమువద్ద కొండగుహలో వేమన కట్టకడపట ప్రవేశించినాఁడని యక్కడి వేమన మతానుయాయులగు యోగులు కొందఱు చెప్పకొనుచున్నారని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రలవారు నాతోఁ జెప్పిరి. ఇది పురాణముల కథ.

ఇక చరిత్రమును చాల పరిశోధించి వ్రాసినవారిలో ముఖ్యులగు కీర్తిశేషులైన వంగూరి సుబ్బారావుగారు వేమన వంశమును గూర్చి సందేహముగా వ్రాసిరి. దేశమునుగూర్చి యంతకన్న నెక్కువ నిశ్చయముఁ చేసికొని, మొదలు కొండవీడు, దత్తమండలములు, గోదాపరిదేశము - ఈ మూఁ డిటియందును వేమన సంచరించి యుండవచ్చు ననుకొన్నను, తరువాత, వారికి తక్కిన యన్నిసాక్ష్యముల కంటె "కుక్కతోఁకఁబట్టి గోదావరీదునా" యను నొక వాక్యమే ప్రబల ప్రమాణముగాఁ గానవచ్చి 'గోదావరి మండలమున వీదులలోఁ బాఱవైచిన పల్లాకులలోని యాహార మును మృగపక్షులతోఁగలిసి భుజించువాఁడు" అని నిర్ణయించుకొనిరి! *[1]కాలమును గూర్చి యింకను ఎక్కువ నిశ్చయముగా నూహచేసిరి. పదునాఱవ శతాబ్దాదియందు కృష్ణదేవరాయల సమకాలికుఁడగు ఎడపాటి ఎఱ్ఱాప్రెగడ తన 'మల్హణ చరిత్రము' నందును, ఆ శతాబ్దాంతమందలి తురగా రామకవి తన "నాగరఖండ" మందును, పదునేడవ శతాబ్దమందలి పింగళి యెల్లనార్యుఁడు తన 'తోభ్య చరిత్రము" నందును వేమన్నను బేర్కొని యుండుటచేత ఇతఁడు ox-వ శతకమందున్నవాఁడని వారి

  1. * చూ, వం, సు, వేమన, ప, 170.