పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 28

యూహ. కావుననే -

          "ఆ. పరఁగరాయని కులబాచని ధనమెల్ల
                భటులపాలు కవుల పాలు తలప,
                ఒనర హీనజనుని ధనము దాయాదుల
                పాలు జారకాంతపాలు వేమ" (24-22) ♦[1]

అను పద్యమును వేమన 14-వ శతాబ్దము తుదలోనున్న రాయని భాస్కరునిగూర్చియే వ్రాసెనని తల(చిరి. మఱియు

           "శ్లో|| నిర్మాయ నూతన ముదాహరణానురూపం
                  కావ్యం మాయాత్రనిహితం నపరస్యకించిత్
                 కింసేవ్య తే సుమనసాం మనసాపి గస్థః
                 కస్తూరికా జననశక్తిమతామృగేణ" (రసగంగాధరము) *[2]

యని స్వాభిమానపూర్ణుడై చెప్పిన పండితరాయఁడు---

           'ఆ, ప్రస్తుంతబు వేళ పద్యంబు చదివిన
               తప్పలెన్నియున్న నొప్పియుండు ----" (26-38)

అను వేమన్న పద్యమునే
              "అపసరపలితావcచీ గుణగణరహితాపి పహతి పరమోదమ్"

అన్నట్లు సంస్కృతమున భాషాంతరీకరించుకొనియెసని చెప్పిరి !**[3] ఇంతేకాక

           క, భవదూరు(డు శరభాంకు (డు
              శివనీలుఁడు చేయు(గోటి సిద్దేశ్వరుఁన్
              శివభృత్యుఁడు వటమాలుఁడు
              శివమయ చిన్మయుఁడు సోమశేఖర గురుఁడుస్"
                                                                (ఓ. లై., 12-1-35)

ఆను వేమన పదములలోని యొుకానొక పద్యమున వేమన్నకు గురువుగాఁ జెప్పఁబడిన సోమశేఖరుఁడును, వీరభద్రవిజయముస బమ్నెర పోతన్న తన గురువుగాఁ జెప్పుకొన్న 'ఇవ్వటూరి సోమవిభుఁడును" ఒకరేయని తలఁచి పోతన్న వేమన్న లిరువురును సహాధ్యాయులై యుండవచ్చునని లూహను సాఁగఁదీసిరి !

కాని వీరి యీ కాలనిర్ణయం నెవ్వరును అంగీకరింపలేదు. భంగారుతమ్మయ్యగారు, శ్రీ ప్రభాకరశాస్త్రులుగారు దీనిని సయుక్తికంగా ఖండించిరి.†[4] పై రాయని భాస్కరుని పద్యమునకు పెక్కు వ్రాతప్రతులలోను అచ్చుప్రతులలోను ఈ పద్యం గలదు.

  1. ♦ ఈ ప్రతిలో 'రాజకులులు పాతినధనము' అని పాఠము గలదు. కాని, ధ్రాంతి, వ్రాఁత ప్రతులలోను, ప్రాఁతప్రతులలోను 'దాచని ధనము' 'బాచన్న ధనము' అనియే కలదు. 'బాచున్న' యను పాఠమును గలదు. అదియు పొరఁబాటే. ముందు చూడుము.
  2. * ఉదాహరింపఁదగిన వానినెల్ల నేనిందు కొత్తగా రచించితిని గాని యితరుల పద్యము లిందేమియు జేర్చలేదు. కస్తూరిని బట్టింపఁగల మృగము పువుల వాసన మనసున నైనఁ దలఁచునా ? అని తా.
  3. ** వం. సు. వేమన. పు. 124.
  4. † చూ, ఆంధ్రపత్రిక, రక్తాక్షి, క్రోధన, అక్షయ సంవత్సరపుల సంచికలు.