పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

వేమన

బహుళ చతుర్ధశినాఁడు-అనఁగాఁ ఇతని ఇరువదవయేఁటను, భార్య అక్కలమ్మ (ఆదిలక్ష్మమ్మ) నల సంవత్సర పుష్యశుద్ధ షష్టినాఁడు, ఇతని 76వ యేఁటను, ఇతఁడు విభవ సంవత్సర పుష్యశుక్లాష్టమి—అనఁగా, తన 89 వ యేటను ఇహలోక యాత్ర ముగించినట్లు ధర్మకర్తలయింట వ్రాఁతలు గలవు. అనఁగా, ఇతఁడు క్రీ.శ. 1869 వ సంవత్సరమువఱకును జీవించియుండెనని చెప్పవలయును. కాని యూ తేదీలు సరియైనవి కావేమో ! ఎందుకనఁగా, ముగ్గురిమృతియు పుష్యమాస మందే జరుగుట యొక వింత. మఱియు, నేఁటికి 59 సంపత్సరములక్రింద చని పోయినవానిని చూచినవా రా యూరిలోఁగాని, చుట్టుప్రక్కలఁగాని యొక్కరైన నుండవలదా ? అక్కడ డెబ్బదియేండ్లు దాఁటిన ముసలివా రనేకు లున్నారు. వేమన్నకూఁతురగు అచ్చమ్మను తన చిన్నవయసున చూచితిననియు, అప్పడామెకు సుమారు డెబ్బదియేండ్లుండవచ్చుననియు "షేక్ ఆలం ఆను నొకానొక మనలి సాహేబు చెప్పెను. అతనికిప్పడు సుమారు ఎనుబదియేండ్లు, మఱియు, నీ వేమన్న 1869లోనే సిద్ధుఁడగుట నిజమేని, 1898లో-అనఁగా, ముప్పదియేండైనను గాకమునుపే-యీతని విషయమై విచారణచేసి వ్రాసిన కాంబెలుదొర, ఇతఁడు సుమా రిన్నూట యేఁబదియేండ్లక్రిందటివాఁడని వ్రాయుట చిత్రముగదా!*[1] కాని దొరగారు కటార్లపల్లెను చూచినారుగాని, యక్కడివారి నెవరిని ఎక్కువ విచారించినట్లు తో(పదు. బ్రౌనుదొర క్రితఁడు సమకాలమువాఁడే కావునఁ గాఁబోలు అతని కీతని సమాచారమే తెలియదు. అది యట్లుండె. తల్లి భార్యల మృతికాలమును, ఈ వేమన్న సమాధికాలమును సందేహించినను అతనిజన్మకాలమును సందేహించు టకు కారణము లేదు.

ఇట్లు కొండవీటివేమన్నయ, తుంగ వేమన్నయు వేఱువ్వక్తు లైననుఁ అతని మరణకాలమును, ఇతని జననకాలమును శార్వరి చైత్ర శుక్ల నవమిగానే యుండుట వింతలో వింతగదా! ఇది యిరువురు నేకవ్యక్తియను బ్రాంతిచేఁ గలిగిన దనుకొంద మన్న ఈ బ్రాంతికిఁదోడు పుట్టినపండుగ తద్దినము నొకటిఁగాజేయు వింత బ్రాంతిని గూడఁగట్టుకోవలసివచ్చును! అటైన నీ యిరువురిలో నెవరో యొకరు పుట్టినదో గిట్టినదో శార్వరి సంవత్సర చైత్ర శుక్షనవమి కావలయును. కొండవీటి వేమన్న పై తేదీలో సిద్ధిపొంది నాఁడని వ్రాసినవారందఱును నిన్నమొన్న యతని పద్యముల నచ్చువేసి పీఠికలు వ్రాసినవారే కావున, వారికన్న ప్రాచీనమైన తుంగ వేమన్న వంశమువారి వ్రాఁతయే మనకెక్కువ ప్రమాణము గావలసియున్నది. మఱియు వా రిప్పటికి చైత్ర శుక్ల నవమి యాతని తిరునాళ్ళ నడుపుచున్నారు. కావున పై తేదీ తుంగ వేమన్నదే యనుకొని యా తంటా నింతటితో వగcదెంచుకొందము ! ఇట్లు కట్టకడపట మన వేమన అద్యంతశూన్యుఁడైన సిద్ధమూర్తి యయినాడు.

ఐన మన వేమన్నకు కటార్లపల్లెతో సంబంధమే లేదా ? ఉన్నదని సందేహింప వలసియున్నది. కారణ మేమనఁగా; ఈ ప్రదేశమం దతఁడు సంచరించి కొన్నాళ్ళు నిలిచి తన మహత్త్వమును ప్రకటింపక యుండెనేని, తుంగ పుల్లారెడ్డి తాను వేమన్న యని మాఱుపేరు పెట్టుకొని, యతనివలెనే పద్యములు వ్రాసి, యతని యోగ సిద్దాంతములనే యవలంబించుట, ప్రజలతని నతని యవతారమే యని నమ్మి పూజించుట, సంభవింప దనుకొనుచున్నాను. ఆంధ్రదేశమంతయు వేమన్న సంచ

  1. * *See Mad. Christ. Coll. Mag., March 1898, p. 524.