పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము. 13

వేమన పద్యములకు పీఠికారూపములైనవి, వ్రాసినారు. (-3) శ్రీదత్తాత్రేయ పరంప రాగత శ్రీజ్ఞానానందయోగి విరచితమైన "తత్త్వార్ధబోధిని". (3) వావిళ్ళవారు కడపట ముద్రించిన పేరులేని యాంధ్రతాత్పర్యము. (4) కరూరు బంగారయ్యగారు రచించిన '" వేమనార్యుని పద్యపదశబ్రార్ధము " . (5) బ్రౌనుదొర వ్రాసిపెట్టియుఁ గొంతవఱకు ప్రకటించియున్న ఆంగ్లేయ పరివర్తనము.

ఇందు మొదటి దానిలో ఒక్కొకపద్యముక్రింద పుటలకొలఁది వివరణము గలదు. అనేకశ్లోకములు, స్మృతులు, శ్రుతులు. పురాణములు ఉదాహరింపఁబడినవి. ఈ వ్యాఖ్యాతకు వేమన్న యందు చాలభక్తికలదు : అతని తత్త్వములను తాననుభవ పూర్వకముగా నెఱిఁగినవాఁడని పలుమాఱు తెలుపుచుండును. కాని యొకటే తక్కువ-మూలమునకును వ్యాఖ్యానమునకును సంబంధము. రెండవది కొంత మేలు. కాని యిందును మనకుఁ గల సందేహములు తీఱుట యరుదు. అందందు అప పాఠములకు సాహస వ్యాఖ్యానము గలదు. ఈ యిరువురును కొన్ని పద్యములకు మాత్రము టీక వ్రాయఁబ్రయత్నించినవారు. మూఁడవదియగు వావిళ్ళవారి వ్యాఖ్యలో దొరికిన యన్ని పద్యములకును అర్హతాత్పర్యములు వ్రాయుప్రయత్నము చేయఁబడి నది. అందలీకి నర్థమగు పద్యముల కల్లారు ముద్దగు టీక, సందిగ్ధములైన పద్యము లందు చల్లని రెండుమాటలతో చప్పన జారుకొనుట ఇందలి విశేషములు. వేమన్న యందలి వ్యాసఘట్టముల కెన్నినిటికో “సులభము', 'స్పష్టము' అనుటయే వీరి వ్యాఖ్య. *[1]నాలుగవది ఈయన్నింటికంటె వింతయైన ప్రతిభాశక్తిని జూపును. ఒక పదమునకు దీనియందలి యర్ధము మచ్చుకు : “లంజ? లం = పృథివి ; జ=పట్టబడినది. పుష్పం-అనఁగా, పుష్పముయందు బుట్టిన లక్ష్మి యగుటవల్ల తల్లి ! (చూ, వేమ నార్యుని పద్యపద శబ్దార్థము, పే.9) ఇంతచాలును. ఐదవదగు బ్రౌను దొరది భాంషాంతరీకరణమే కాని టీక కాదు. కాని మూలార్ధమెఱుఁగుటకు నిష్కపటముగా ప్రయత్నించిన పుణ్యాత్ముడితఁ డొక్కఁడే ఐసను ఇతని భాషాంతరీకరణము అనేక పద్యములకు భావమెఱుఁగకయే చేయఁబడినది.

ఇట్లు ప్రకృతము మనకు పనికి వచ్చు వ్యాఖ్యయొకటియు లేదు. కావున ఎవరి యోగ్యతకొలఁది వారే వేమన పద్యముల కర్ధనిర్ణయము చేయవలసియున్నది. నా శ కొల(ది నేనును బ్రయత్నింతును.

సందర్భముస వేమనపద్యములందనేకములకు మకుటమైస “విశ్వదాభి రామ' యను పదమున కర్ధము విచారింపవలసియున్నది. దీనికి 'విశ్వధాభి', 'విశ్వదాభి" 'విశ్వతోభి'–యని మఱిమూడు పాఠాంతరములు గలవు. కడపటి రెండును వ్రాఁతప్రతులలో నపురూపముగఁ గానపచ్చును. 'విశ్వదాభిరామ యనియే తొంబది పాళ్ళు 'విశ్వతాభి' యనునది దానికి తరువాత తక్కిన దానికంటె నెక్కువగాఁ గాన్పించును (చూ.ఓ.లై; 11-6-22; 11-6-24; 13-10-9) కాని, “విశ్వదాభిరామ' యనునదియే మూలపాఠముగా భావించి యనేకవిద్వాంసు లనేక

  1. * ఈ ముద్రణమున ప్రకాశకులు నాచే నొక చిన్న పీలికి వ్రాయించి టీకి వాసిన వారి పేరు పెకి టింపక పోవుటచే దీనిని నేనే వ్రాసినానను అపఖ్యాతి నాకు గలిగినది. అది బ్రాంతిమూలకము. ఒకరి క_ర్తృత్వము వేమౌsరికి పందించుట కడుంగడు నన్యాయ్యము గావన అది నాదికాదను సత్వము నిచ్చటఁ బ్రకటింపవలసి యున్నిది.