పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యము ఎల్లవారును ఎఱింగినదే. ఇందులకు మొదటికారణము శాస్త్రులవారే. వారి మాటల ధోరణియట్టిది. గొప్ప వ్యాకరణ విషయములను గుఱించి యుపన్యసించునపుడు సయితము శ్రోతలు కడుపులు చెక్కలగునట్లు నవ్వవలసినదే. మాటవడియు తడవు కొనక జవాబు చెప్పుటయు శాస్త్రులవారికి సహజములు. శాస్త్రులవారి నాటకములు లోకస్వభావానుకరణములు. లోకవృత్తాను కరణమునవారిది మొదటిచేయి. మాటలును చేష్టలును ఇతరులవి అట్లె అభినయించి చూపగలిగినది వారిశక్తి. శాస్త్రులవారి నాటకములు అంతటి ప్రసిద్ధిని చెందుటకు ముఖ్యకారణము వారి పాత్రోచితభాష. సాయెబులు, చాకళ్లు, మంగళ్లు, పామరులు, విద్యావంతులు, బాలురు, స్త్రీలు, అరవలు మొదలైన వారి గ్రామ్యభేదములను మెలకువతో కనిపెట్టి తమనాటకములో ప్రయోగించియున్నారు. ఈ గ్రామ్యభేదముల నన్నింటిని తమ బాల్యమునుండియే కనిపట్టుచువచ్చినారు. ఇదియే ప్రతిభ.


_________