పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

విశాఖపట్టణములో ఘనపండావారని సుప్రసిద్ధబ్రాహ్మణ కుటుంబమువారు ఓడ వ్యాపారు లుండిరి. కాలక్రమమున వారి యైశ్వర్యమంతయు నశింపగా నా పరంపరకుం జెందిన కడపటి బ్రాహ్మణుడు కాశీయాత్ర పోయెనని ఆ దినములలో ఆయనంగూర్చి కథలుగా చెప్పుకొనువారట ప్రతాపరుద్రీయములో చతుర్థాంకమున విద్యానాథుని యుగంధరుడు 'నీ ప్రథమోపాథ్యాయులు ఘనపండా దిగ్విజయ జ్యౌతిషికులు క్షేమమా?' అని యడుగును. వాస్తవముగా ప్రతాపరుద్రుని కాలమున నట్టివాడు లేడు; ఆతడు విద్యానాథునికి గురువునుంగాడు. శాస్త్రులవారు తమ సమకాలికుల నామధేయమును చమత్కారముగా నిచట ప్రయోగించినారు.

ఆనాటకమందే అష్టమాంకమున సుల్తానుముందు వర్తకు లాడించిన నాటకమున సిఫాయి పాత్రములు 'మనము గులాందస్త ఖైర్మునిషీ చేతకట్టించుకొన్న పాటకానిత్తమురా' అని పాడుదురు. ఈమునిషి శాస్త్రులవారికి సమకాలికుడు.

శాస్త్రులవారు జంగముపాటలు వినుటకు చెవికోసికొనెడి వారు. వానిపై వారికి ప్రీతిమెండు. బాల్యములో జంగము పాటలు, ముష్టివారిపాటలు, పడవవాండ్ర పాటలు ఒడలు తెలియని యావేశముతో విని కంఠస్థములంజేసినారు; తమ నాటకములలో రసాత్మకమైన యీగ్రామ్యోక్తులకు ఎక్కువతావొసంగినారు. శ్రీ శాస్త్రులవారి యుపన్యాసములయందును, నాటకములయందును మెండుగా హాస్యరసము స్ఫురించుచుండు ననువిష