పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

గోదావరిలో ఈత్తున్నారండి, నడివరదలో ఉన్నారు. కూడా వెళ్లినవాళ్లంతా వెనక్కు వచ్చేశారండీ. మీవాళ్లు మాత్రం అమాంతంగా చచ్చిపోతున్నారు." అని చెప్పిరి. 'ఊం' అని గంభీరముగాను కోపముగాను చూచిరేగాని తండ్రిగారు మఱేమియు బదులు చెప్పలేదు. మఱికొంతసేపటికి ఆ మనుష్యులే వచ్చి 'ఎవరోచూచి బోటులో ఎక్కించుకొన్నారండి. వస్తున్నారండి.' అని చెప్పిరట. 'వస్తున్నారూ? సరే, అని' బదులు చెప్పినారు తండ్రిగారు. కొమారులు ఇంటికివచ్చిన యనంతరము వారిని ఈవిషయమైనను వా రడుగలేదు. కొమాళ్లును భయపడి తండ్రిగారి ఎదుటికి పోలేదు.

ప్రతాపరుద్రీయము రచించునెడ విద్యానాథ పాత్రను నిర్మించుచు ఇదంతయు జ్ఞప్తికిందెచ్చుకొని విద్యానాథునికి చేర్చి సంవిథానమల్లినారు. గోదావరిపై వారికి మక్కువ యట్టిది.

ఒకపాటి మాటవిసరు శాస్త్రులవారికి బాల్యమునుండియు కలదు. అల్లాడి సదాశివశాస్త్రులవారు, తర్వాత శాస్త్రులవారికి శ్వశురులు, బాల్యములోనే యిల్లువదలి ఓడనెక్కి కటకము బరంపురము మొదలయిన ప్రదేశములకు పోయి వ్యాపారము చేసి విశేషధనమార్జించి, వేంకటరమణశాస్త్రులవారు విశాఖపట్టణములో నుండగా, ఇంటికి నెల్లూరి సీమకు మఱలు చుండిరి. వేంకటరమణ శాస్త్రులవారిని చూచుటకు మార్గ మడుగుచు ఒక వీథిచివరను వేంకటరాయ శాస్త్రులవారిని చూచి పోలిక చేత ఊహించి "బాబూ, నువ్వెవరిఅబ్బాయివి?" అని ప్రశ్నించిరి.