పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలానుక్రమణిక


1853 డిసెంబ్రు 21 తేది వేంకటరాయశాస్త్రులవారి జననము

1860 జూలై 14 తేది పూడ్ల రామకృష్ణయ్యగారి జననము

1869 శాస్త్రులవారు మెట్రిక్యులేషను పరీక్షయగుట

1862 చిన్నయసూరిగారి నిర్యాణము.

1875 శాస్త్రులవారు ఎఫ్. ఏ. అగుట.

1879 ఆగస్టు 3, వీరేశలింగము పంతులువారు విధవావివాహమును గురించి చేసిన యుపన్యాసము మిద శాస్త్రులవారు రాజమండ్రినుండియే ఖండనోపన్యాసముంగావించిరి. [వీ. లిం. స్వీయచరిత్ర -పు 140]

1883 స్త్రీ పునర్వివాహ దుర్వాదనిర్వాపణ గ్రంథము ప్రకటితము.

1885 శబ్దరత్నాకర ప్రథమ ముద్రణము.

ఆముద్రితగ్రంథచింతామణి ప్రారంభము.

1886 జూలై 25 శాస్త్రులవారి కుమారులు వేంకటరమణయ్య (రాజన్న) గారి జననము.

ప్రక్రియా ఛందస్సు, అలంకారసారసంగ్రహముల రచన

భోజవిక్రమార్క చరిత్రములు తెనుగుటీకలతో ముద్రించుట

నవంబరు క్రిశ్చియన్కాలేజీ సంస్కృతపండిత పదవినందుట

1887 బి. ఏ. పరీక్షకుపోవుట.

1888 ప్రతాపరుద్రీయకథను జనవినోదినిలో బ్రకటించుట

1890 జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను ప్రారంభించుట

1891 కథాసరిత్సాగర ప్రథమముద్రణము

మార్చి, 20 శుక్రవారము సాయంకాలము శ్రీ. బ. సీతారామాచార్యులవారి నిర్యాణము.