పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

           "ఈ లఘువిమర్శనచే నీగ్రంథమున జక్కనకవి
        'ప్రతిపద్యము జోద్యముగా
        గృతిజెప్పిన నొప్పుగాక కృతి నొకపద్యం
        బతిమూడుడైన జిత్రత
        బ్రతిపాదింపడె ఘణాక్షరన్యాయమునన్‌'

అని ప్రతిజ్ఞచేసినట్లే ప్రతిపద్యరసాయనముగా నున్నదని చూపితిని. ఇట్టి యీగ్రంథమును ముద్రించుటకు ఈశోధకు లెంత యసమర్థులో అది తెల్లముంగావించితిని. జక్కన కవనరసముం గ్రోలువారికి కొంతదారి చూపితిని."

ఈగ్రంథ ముద్రణానంతరము ప్రతిపక్షుల యాక్షేపము లెక్కువయైనవి. ఈక్రింది జాబులంగనుడు.

2-7-98 నెల్లూరు

ఆర్యా, నమస్కారములు.

తామువ్రాసినకార్డు చేరినది. విషయముంగని ముదమందితిని. ఏనెట్లును మిమ్మేమియుజేయజాలరని దృడముగా నమ్ముడు. సుబ్బరాయనింగారి యభిప్రాయము సరసమైనది. పద్మనాభశాస్త్రి సంథానకృత్యమునకై వచ్చియుండును. సందీయకుడు. జ్యేష్ఠమాస సంజీవని వచ్చినది. దానిలోను పంతులుగా రొక కొన్ని పద్యములతో నేడ్చియున్నారు. అన్ని పద్యములును అన్యాపదేశముగావ్రాసి నిందించినారు. వానిలో మీకు దెలుగుభాషలో బాండిత్యములేదని సూచింపబడియున్నది. మీరు సంస్కృత పండితులేగాని యాంథ్రపండితులుగారట. ఆ సంజీవనింజూచిన