పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్ని పద్యములును విశదములగును. జూలై యముద్రితగ్రంథచింతామణిం బంపినాను. చేరియేయుండును. దానిలో ముద్రణ విమర్శనమున్నది. వేంకటకృష్ణమసెట్టిగారు త్వరలోనే మీతో మాటలాడుదురని నాకు దోచుచున్నది.............

పూ. రా
తే 6-7-98 ది. నెల్లూరు.

ఆర్యా, నమస్కారములు.

తాము వ్రాసినజాబుంగని కడుముదమందితిని. మీకింక మంచికాలము రానున్నది. మీ శత్రుసమాజమంతయు మీకింక నైదుపది జేయును. విక్రమవిమర్శనమే యిందుకు సాక్షియై మీ పరాక్రమమును వ్యాపింపజేయుచున్నదిగదా. ఇక బ్రసన్నము ప్రసన్నమగుట యరుదా. త్వరలో వ్రాతకు నారంభింపుడు. ఎన్ని పుటలు వ్రాసినది యీసారికార్డులో వినగోరినాను. ఇట్లు వ్రాసినందులకు మన్నింపుడు........

పూ. రా.
తే 8-7-98 ది నెల్లూరు.

ఆర్యా, నమస్కారములు.

మొన్నటిరాత్రి ఆర్ వెంకటసుబ్బయ్యగారితో మాటలాడునపుడు వారు మిమ్ములను జులకనగా వాకొనుటయ గక.........

పూ. రా.
తే 15-8-98 నెల్లూరు.

ఆర్యా, నమస్కారములు.

తాము తే 13 ది వ్రాసినజాబు చూచితిని మీయిష్టానుసారముగ జేయుటకు నేయాక్షపణమును లేదు. శశిలేఖలోని