ఈ పుట ఆమోదించబడ్డది
ధృతచేతనంబులై దివ్యాయుధంబులు
జయ జయ ధ్వనులతో సంస్తుతింపఁ
తే. గలువ రేకులు వోని పెంజిలువరేని
యరఁటి కుబుసంబు పొరలు మై నంటియుండ
నిదుర మేల్కాంచి కూర్చుండు నుదధి నడుమ
విష్ణుఁ డఖిలేశ్వరుఁడు శరద్వేళయందు.”
నిదురమేల్కొను వేళ నీరాజన మెత్తుట భారతదేశమున రాజప్రాసాదముల
యందలి బ్రాచీనాచారము. తాననుభవించిన యీ యాచారము స్మృతికి వచ్చిన
115[1]శ్రీరాయల కిట్టి దర్శనము కల్గినది.
ఆ.వె. "సాంధ్యరాగలహరి సామి రంజితములై
తిరిగి మింట నిదురఁ దెలసి నట్లె
యిందిరాధిపతికి నెత్తు కర్పూర నీ
రాజనంబు లన శరద్ధనములు.”
- ↑ 115. రాయలు క్రీ.శ. 1509-30ల మధ్య విజయనగర సమ్రాట్టు, ఆముక్తమాల్యద
కర్త. సాంధ్యరాగలహరి - ఆముక్తమా. ఆ. 4, ప. 139.
____________________________________________________________________________________________________
మణిప్రవాళము
69