అధస్సూచికలు 1. J.A.H.R.S, Vol. ii, page. 173
2. మార్తాండకుల శాహమహీపాలుసభను కీర్తికెక్కినవాడు గిరిరాజసుకవి సంగీతకళా రహస్యము గన్నవాడు వెంగనార్యుండు వివేకధనుండు (Saraswati Mahal Telugu Manuscripts catalogue : Page, no. 124)
3. అనఘసన్నుతికి శాహావనీపతికి నింబాజి వ్రాయించె నిఖిలార్థవితతి కంభోధియగు చుండు నట్టి భారతము నిటలాక్షపదపద్మ నిహిత ప్రసన్న పటుచిత్తుడైన కుప్పయమంత్రిచేత.
4. తంజాపూరు సరస్వతీ మహల్ గ్రంథాలయ పట్టికయందు లేని గ్రంథములకు మాత్రమే యిచట నాధారములు చూపబడును. మిగిలిన గ్రంథము లా పట్టికలోనివే.
5. కొరవంజి శబ్దము దేశ్యము ఎఱుక వాడు, ఎఱుకది, సోదియని యర్థము. ఈ కవితావిభాగము (Poetic form) నకు ముఖ్య లక్షణము నాయికావిరహము, ఎఱుకది సోది జెప్పుట, తరువాత నాయికానాయకుల వివాహము. ఇందు కవి ప్రాచీనాంగ్ల నాటకములందలి ప్రస్తావన (Prologue) వలె కథావస్తువును దిజ్మాత్రముగా మొదట సూచించును. ఉదా : శ్రీ సుతుతుల్యుడై చెలువొందునట్టి భోసల కుల శాహభూపాలు మీద చెన్నుగా మోహితచిత్తయై రాజకన్నెకామణి సరికాంతలు గొలువ గరిమతోడుత మును కదలి వచ్చుటయు నెఱుకత వచ్చి తా నెఱుక జెప్పుటయు గురుతుగా శాహేంద్రుగూడి యుండుటయు అనియెడి రాజమోహన కొరవంజి
6. J.A.H.R.S., Vol, ii, 173.
7. ‘నౌకా చరిత్రము' - వేంకటేశ్వర ప్రెస్ మద్రాసు (1907)
8. Andhra Patrika, 22nd May 1937
9. See the famous introduction of Kane to Uttararamacharitra.
10. Quarterly Journal of the Mythic Society, July - October, 1935
11. "An amatory poem written by Palani...... It does not seem probable that the lady herself composed the whole poem, parts of which display much learning. Her name and the other names she introduces as her relations appear to be Maharatta, utterly different from Telugu appellations. Her tutor Vira Raghavachari probably assisted her, but the composition in other
444
వావిలాల సోమయాజులు సాహిత్యం-4