శిక్షారక్షణలకు, ఉత్తరమాదర్శ సిద్ధులకు, ప్రవృత్తి నివృత్తుల సక్రమ సమ్మేళనం గల నిత్య ప్రగతి మార్గ సంచారాలకు నాటి నుండి నేటివరకూ నిరుపమమైన దోహదం చేస్తున్నవనటం నిస్సంశయం.
మన కర్తవ్యము
ఈ ఉత్సవాలను లోచూపుతో ఇతోధికంగా అవగతం చేసుకొని పునరుజ్జీవనాన్ని పొంది, ఆర్జించిన జ్ఞాన విజ్ఞానాల కనుగుణంగా ఆదర్శ జీవితయాత్రను సాగిస్తూ, అతిశయ శ్రద్ధా భక్తులతో సేవించి మాతృదేవీ మూర్తుల అపారమైన అనుగ్రహ విశేషం వల్ల సంప్రాప్తించే సర్వశక్తులను సమీకరించుకొని, వైజ్ఞానికరంగంలో హిందూసంఘాన్ని ఇతోధికంగా ఏకోన్ముఖమూ, పటిష్ఠమూ చెయ్యడానికీ, సముజ్జ్వలంగా హిందూ సంపదను పెంపొందించడానికి, బలప్రదర్శనాదులతో హిందూత్వాన్ని పరిరక్షించుకుంటూ విశ్రుత విజయాన్ని సాధించుకోటానికి మనం కడు జాగరూకతతో మెలగవలసి ఉంది. ఉత్తమ జీవిత దృక్పథం కోసం అందంగా అన్వేషిస్తూ అలసి అలమటిస్తున్న దేశాలకు, నీచ జీవన పద్ధతులతో నిలువునా మునిగి బ్రతుకుతూ, అయినా అదే ఇతరులు అనుసరింపదగ్గ బ్రతుకనే భ్రాంతితో విర్రవీగుతున్న వెర్రి దేశాలకూ జ్ఞాన విజ్ఞాన ప్రబోధం చేసి విముక్తిని చేకూర్చటం కోసం, మనం వీరత్వ వివేక విశ్వాసాలతో మన సంస్కృతిచేత సీమోల్లంఘన చేయించి, విశ్వ హిందూత్వ విజయయాత్రకు బయలుదేరవలసిన సమయం వచ్చింది. కనుక మనం కటిబద్దం కావలసి ఉంది. ఇంతటి మహత్తర కార్యభారాన్ని నిర్వహించవలసిన మనకు మహాసరస్వతి వివేకాన్ని, మహాలక్ష్మి సంపత్తిని, మహాదుర్గ శక్తిని, అపరాజితాదేవి విజయాన్ని ప్రసాదించుగాక!
దేవీస్తుతి
యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా ।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥
యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే | నమః*
యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు నిద్రా రూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా | నమః*