Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శిష్యగా గురుగాదయా పతిఘ్నీతు విశేషేణ గింజు లోపగతా చయా' (వాసిష్ఠస్మృతి). విధివత్ పరిగృహ్యాపి త్యజేత్కన్యాం విగర్హితామ్, వ్యాధితాం విప్రదుష్టావా ఛద్మనా చోపపాదితామ్ - భార్య భర్తను పరిత్యజించుటకు 'నష్టా మృత ప్రప్రజితే క్లీబే చ తీతౌ పతౌ పంచ స్వాపత్యు నారీణాం పతిరన్యో విధీయతే', (పరాశరము) భార్యను భర్త త్యజించినను విక్రయించినను భార్యాభర్తల సంబంధము ఉండనే ఉండునని మనుస్మృతి - "న నిష్క్రియ విసర్గాభ్యాం భర్త ర్భార్యా విముచ్యతే” (9-46) ఇట్టివే 2-31 3-24. పూర్వము ఒక స్త్రీని వివాహమాడినవాడు పరపూర్వాపతి, అన్య స్త్రీలోలుడై భార్యను త్యజించిన వాడు స్త్రీ జితుడును పాపభాజనుడు - అతనికి యావజ్జీవమూ అశౌచ ముండునని భారతీయ ధర్మశాస్త్రము.

85. భార్యాభర్తల మధ్య ఉండే అంతరము మూలమున పూర్ణాయుర్దాయము నొందు సంతానము కలుగునని భారతీయుల నమ్మకము. శుశ్రుతాచార్యుని అనుసరించి స్త్రీ ఋతుధర్మం 12 ఏట ప్రారంభము. 15 మొదలు 45 వరకును స్త్రీలు సంతానవతులు కావచ్చును. అందువలన యువకుడు 30 ఏట స్త్రీ 12వ ఏట వివాహము చేసుకొనిన వైవాహిక జీవనము సంతృప్తికరముగను, సంతాన వంతముగను నొప్పునని భారతీయుల అభిప్రాయము. (అష్టాంగ హృదయము - శరీరస్థానము) ఆధునిక వివాహగ్రంథకర్త పాశ్చాత్యలోకముల ఆర్థిక సాంఘికాది పరిస్థితులు అనుసరించి కన్యకకు 25 ఏటను, యువకుని కంతకంటే కొలది సంవత్సరముల తరువాతను వివాహ యుక్తవయస్సు (Griffith Moderm Marriage p. 52) నేటి ఉత్తమ మధ్య తరగతి భారతీయులలో 16 మొదలు 24 సంవత్సరముల మధ్య వివాహములు జరుగుచున్నవి. భార్యాభర్తల అంతరము సామాన్యముగ 5 మొదలు 15 వరకు నున్నది. నేడు స్త్రీకి 18 సంవత్సరములు, 25 సంవత్సరములు పురుషునకు వివాహయోగ్య కాలముగ నిర్ణయింపవచ్చునని ఒక విజ్ఞుని అభిప్రాయము. అంతరమును గూర్చి ఆయన ఇట్లు వ్రాసినాడు. "Ten Years of age may be put as the safe biologic "Buffer" between marital partners in view of the fact that senile changes take place earlier in women than in men and that feminine charms is always the outstanding asset in the balance sheet of Nuptials.".

86. History of Human Marriage. WESTERMARCK- 'Marriage Consent'

87. ప్రపంచమునందలి వివాహ వ్యవస్థ ఒకనాడు జన్మించినది కాదనియును క్రమపరిణామమున నేటి రూపము వహించినదనియును తెలియుచున్నది. (Marriage WESTERMARCK; Origin of Family Angels.) ప్రాచీన భారతమున ____________________________________________________________________________________________________

సంస్కృతి

175