మార్గమునకును, లింగమునకును సంయోగము కుదరదు. ఇందు స్త్రీకి విసృష్టి
సుఖముండదు. కామాపత్రసీమకు (Clitoridal Region) ఇందు సంబంధముండక
పోవుట గొప్పలోపము అని ఆయన అభిప్రాయము. (Marriage - Vendevelde
117-119) కాని ఇతని అభిప్రాయములకు భిన్నముగ క్లోట్జ్ అను శర్మణ్య
మానవజాత్య శాస్త్రజ్ఞుడు (Sexual Anthropology) వ్యాసకరణములత్యున్నతము
లైనవనియును ప్రతివ్యక్తియును వానిని స్వీకరింప వలయుననియును
అభిప్రాయమిచ్చినాడు. (Der MenschEin Vier Fussler Berlin 1908) క్రీ.శ. 2వ
శతాబ్ది నాటి రోమక శిల్పమున నీ వ్యానకరణములే విశేషముగ శిల్పితములైనవి.
ఇందలి ధేనుకావ్యానత బంధమున (Bovine Posture) నితర బంధములన్నిటి
కంటె యోనికుల్య (Vaginal Canal) విశేషముగ స్రవించునని పిళ్లై మహాశయుని
అభిప్రాయము. (The Art of Love and Sane Sex living A.P. Pillai, pp. 878-9)
అందుమూలమున దీర్ఘలింగమునకును, గర్భోత్పత్తికిని నీ కరణములు
ఆత్యుత్తములని చెప్పవచ్చును.
70. వాత్స్యాయన కామసూత్రములు (2.6.42)
71. చిత్రరతముల గూర్చియు, సామాన్య రతి విధానముల గూర్చియు వాత్స్యాయన మహర్షి అభిప్రాయములనే భంగ్యంతరమున ఎల్లిస్, హేర్ష్విల్డె (Sex in Human Relationship), ఇవాన్సు (Men and Women in Marriage), రైట్ (Sex feels in Marriage) మొదలగు పాశ్చాత్య విద్వాంసులు వెల్లడి చేసి ఉన్నారు. వాత్స్యాయనుడు పలికినట్లు సాంప్రయోగిక విధానవైవిధ్యము మూలమున బహు శృంగార లక్షణుడగు (Poly-Erotic) పురుషునకు అసౌఖ్యము ఏకపత్నీత్వమున లభించుచున్నదని అంగీకరించు చున్నారు. విసుగును పోద్రోలుట, ఒకరికి గాని, ఇరువురకు గాని రతి సౌఖ్యమును వృద్ధి యొనర్చుట, ఆరోగ్య విషయకములును, స్థూలాది శరీర దోషము వలన కలిగిన అశక్తతను తొలగించుట, గర్భోత్పత్తి, గర్భనిరోధము - ఇట్టి రతివిభేద వైవిధ్యమునకు మూల కారణములు. సమస్త వ్యక్తులకు నొక విధానము యుక్తమని నిర్ణయించుటకు వీలులేదు. యాడ్లర్ మహాశయుడు చెప్పినట్లు కొందరు స్త్రీలకు విసృష్టి కలుగవలెనన్న తిర్యక్కరణము గాని (Laleral) పురుషాయితము (Posteriori) గాని కావలసి వచ్చును. (ADLER-Die Mangehate) 'అమెరికాదేశ స్త్రీలలో నెవ్వరికిని వైవాహిక జీవితమున విసృష్టి సుఖము లేకపోవుటకు ఇదియే ప్రధాన కారణమని విజ్ఞుల అభిప్రాయము. ఇందువలననే ఆ దేశములోని విడాకుల వైపరీత్యమును. కేవల ముత్తానకణములను ప్రేమించు పునీత ఒక్కొక్కమారు సద్భర్తను పణ్యస్త్రీల పాలుచేయునన్న హెలీనా రైట్ (Birth Control) ____________________________________________________________________________________________________
172
వావిలాల సోమయాజులు సాహిత్యం-4