Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవకాశము లేదు. సముద్గక ముద్గ కాది తిర్యక్కరణము లందు నాయకుని ఒక తొడ నాయిక ఊరువుల మధ్యనుండును. పరివర్తనక బంధమున నాయకుడు నాయికను వెనుక నుంచి పట్టుకొని రమించును. రతిరహస్య పరివర్తనకమునకును దీనికిని భేదమున్నది. అందు నాయికానాయకులిరువురుమ మేహన సంయోగమైన వెనుక సముద్గక విధానము నొంది విడివడక రమించిననది పరివర్తకము.


కొక్కోకుడు మర్కటకమును స్థితకరణముగ చెప్పినాడు. లలితము పంచసాయక రతిమంజరులందు పద్మాసనముగ నున్నది. యుగ్మపాదము అనంగరంగ రతిరహస్యములలో స్థితకరణముగాని నాగరసర్వస్వము నది తిర్యక్కరణము. రతిరహస్య కామసూత్రములను అనువదించి జూచినచో అర్ధపీడితకము, కార్కటకములు రెండును ఉత్తానకరణములు. 'చరణా వూర్ధ్వం నాయకో స్యాధారయే దితి జృంభితకమ్; తత్కుంచితా ఉత్పీడితకమ్; తదేక స్మిన్ ప్రసారితేర్ధ పీడితకమ్ (2.6.23-25) సంకుచితే స్వబస్తిదేశే విదధ్యాదితి కార్కటకమ్; (2.6.28) ఇవి ఈ బంధ ద్వితీయమునకును వాత్స్యాయన లక్షణములు - అనంగరంగ కర్తకు పూర్వముందున్న రచయిత లందరును పద్మాసనమును, ఉపపాదమును ఉత్తానకరణములుగ నిరూపింప నతడు వీనిని స్థితకరణములుగా పరిగణించినాడు. స్థిత కరణముగ పద్మాసన బంధ మొనర్చుట యతి కష్టసాధ్యము. కామప్రబోధములోని పద్మాసమును నాగరసర్వస్వములోని లలితమును నొకటియని కామశాస్త్ర గ్రంథ పఠనము మూలమున తెలియుచున్నది. అర్ధపాదమును అర్ధోపపాద మనుట యసమంజసము. ఇది పొరబాటు. " బంధురితము అనంగరంగమునను కామప్రబోధమునందును తప్ప తదితర గ్రంథములందు కనిపించుట లేదు. రతిరహస్యమున ఫణిపాశబంధమును వర్ణించు సందర్భమున ఉన్న శ్లోకములోని 'గట్టిగ బిగించు' అను నర్థముగల బంధురిత శబ్ద ప్రయోగమును చూచి కల్యాణమల్లుడు ఈ బంధవిభేదమును సృజించినట్లున్నాడని ఒకానొక నేటి కామకళావేత్త అభిప్రాయము. బంధురితము కామప్రబోధము, అనంగరంగములందు తప్ప ఇతర గ్రంథములందు కనుపించుట లేదు. ఫణిపాశము కామప్రబోధమున కనుపింపదు. దీనికి శక్తిమంతము, దీర్ఘమునైన సాధకము (లింగము) కావలయును. నాగరసర్వస్వ రతిరహస్యములు దీనిని ఉత్తానకరణము క్రింద లెక్కకట్టినవి. ఇందు నాయిక మోకాలి సందులనుండి చేతులపోనిచ్చి నాయకుని కంఠాలింగన మొనర్చిన నది నాగరపాశమగునని నిర్ణయించినవి. స్మరదీపికలో దీని నిరూపణము మరియొక రీతిగ నున్నది. భర్త హస్తములను మోకాలిసందుల యందుంచి రమించు విధానమే ఫణిపాశమని అందున్నది. కామప్రబోధకర్త సంయమన బంధమును కౌర్మమని పేర్కొని


148

వావిలాల సోమయాజులు సాహిత్యం-4