Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంగరంగ కర్తవలె స్థితకరణముగ పరిగణించినాడు. నాగరసర్వస్వకర్త ఉత్తానకరణ విభాగమగు నొకదానిని కార్ముకాకృతిని పోలిన దానిని 'హనుపాద' మని నామకరణ మొనర్చినాడు. అనంగరంగపు పరివర్తితమును పూర్వశాస్త్రజ్ఞులు ఉత్తానకరణముగ పరిగణించినారు. ఇది ప్రత్యేక బంధము కాదని విజ్ఞుల అభిప్రాయము. యుగ్మ పాదబంధమును అనేకులు అనేక రీతులుగ నిరూపించిరి. పద్మశ్రీ దీనిని తిర్యక్కరణ మనినాడు. అట్టయినచో 'ప్రక్కకు తిరిగి పరుండిన నాయిక పాదములు ఎదురుగ కూర్చుండిన నాయకుని క్రోడము వద్ద నుంచును'. రతిరహస్యమును బట్టి దీని స్వరూపమును గ్రహించుట కష్టము. కొక్కోక గ్రంథానువాదకు డొకడు యుగ్మపాదమున నాయికానాయకులిరువురును ఒకరి కొక రెదురుగ ఒక మోకాలిని ముడిచి రెండవ పాదమును ముడిచినవారి పాదమున కెదురుగ నిల్చి రమించుట అని పలికినాడు. రతిరత్న ప్రదీపికలో నాయిక కాళ్ళను ప్రక్కలకు ముడిచి రెండు పాదముల నొక చోటికి చేర్చును. నాయకుడు నట్లే ఆమెకు క్రిందుగ నొనర్చును. కామప్రబోధమున నాయకుడు కూర్చొని కాళ్ళు ముడుచుననియును, నాయికయు నట్లే యొనర్చుననియును నున్నది. విమర్దిత మర్కటక బంధములకు గలభేద మత్యల్పము. ఇందు మొదటి దానియందు భర్త పిరుదులనే వర్తులముగ నాడించును. రెండవ దానియందు పైకి క్రిందికి నాడించును. కొక్కోకకారుడు విమర్దితమున నాయిక నాయకుని కెదురుగ కూర్చుండు ననియును, మర్కటమున తొడపై కూర్చుండి అటే చూచుననియును చెప్పినాడు. ఇది వెనుక మళ్ళ అయిన స్థితకరణము. నాగర సర్వస్వమున ఒక మర్కటబంధమున్నది. కాని దానికిని అనంగరంగములోని మర్కటబంధమునకు పోలిక లేదు. నాగరసర్వస్వమున స్థితకరణములుగ నున్న అశిన, లలితములు - రెండును విపరీత బంధముగ పొడకట్టుచున్నవి.


ఉత్థిత కరణములు (Standing Attitudes): మహర్షి వాత్స్యాయనుడు ఉతిత వ్యాన కరణముల రెంటిని చిత్రరతములనినాడు. సువర్ణనాభుడు స్థితకరణములను గురించి చెప్పలేదు. కాని నీటియందు పరుండి కూర్చొని, నిలచి భూమియందు కంటే సుగమముగ సంభోగించవచ్చునని అతని అభిప్రాయమైనట్లు మహర్షి వాత్స్యాయనుడు “జలే చ సంవిష్ణోప విష్టస్థితాత్మకాం శ్చిత్రా న్యోగా నుపలక్షయేత్తథా సుకరత్వా దితి సువర్ణ నాభః” (2.6.32) అని చెప్పి తదుపరి వానిని శిష్టులంగీకరింపనట్లు వార్తంతు తచ్ఛిష్టే రపస్మృతత్వాదితి వాత్స్యాయనః' (2.6.33) అని తన మతమును నిరూపించినాడు.


సంస్కృతి

149