కొక్కోకుడు క్రీ.శ. 12వ శతాబ్దికి పూర్వుడని నిశ్చయింపవలసి యున్నది. కాని పండిత లోకము ఇతడు పద్మశ్రీకి తరువాతి వాడని భ్రమ పడుచున్నారు.
కొక్కోకుడు రతిరహస్యమును జాత్యధికారాదులగు పదునేను ప్రకరణములుగ
శ్లోక రూపమున వివరించి యున్నాడు. 'వాత్స్యాయనాది ప్రాచీన కామశాస్త్ర ప్రణేతలు
'ధర్మ మర్థం చ కామం చ ప్రత్యయం లోక మేవ చ' అని త్రివర్గములకును పరస్పరానుప
ఘాతకముగ కామమును సేవింపవలసినదని చెప్పియుండగా, ఈయన 'అసాధ్యాయా
స్సుఖంసిద్ధి సాధ్యాయా శ్చానురంజనం రక్తాయాశ్చ రతి సమ్యక్కామ శాస్త్ర ప్రయోజనం’
అని చెప్పినాడు. తన్మూలమున తర్వాతి కాల కామశాస్త్ర గ్రంథకర్తలందరును ఇతడు
తీసిన మార్గమునే అనుసరించి కేవలము జాత్యధికారము, బంధాధికారము, వశ్యౌషధ
విధానములతో అవిచారితమున నారంభించినారు. కొక్కోకుని గ్రంథమునకు
(1) కంచీనాథుడు (2) ఆవంచ రామచంద్రుడు (3) కవి ప్రభువు (4) హరిహరుడు
అను నలువురు పండితులు వ్యాఖ్యానములు వ్రాసినారు. గీత గోవింద కావ్యమునకు
టీక వ్రాసిన కుంభనృపతి, నైషధీయ చరిత్రమునకు వ్యాఖ్యాన మొనర్చిన
నారాయణభట్టును, పంచకావ్య వ్యాఖ్యాతలలో ప్రసిద్ధుడును, దార్శనికాగ్రేసరుడు నగు
కోలాచల మల్లినాథసూరి రఘువంశ కిరాతార్జునీయాది కావ్యవ్యాఖ్యానములలో
కొక్కోకుని గ్రంథమునుండి ఉదాహరణముల నిచ్చినారు.
క్రీ.శ. 1422-40 మధ్యకాలమున విజయనగర సామ్రాజ్యమును పాలించిన
ఆంధ్ర చక్రవర్తి ఇమ్మడి ప్రౌఢదేవరాయలు రతిరత్న ప్రదీపిక అనునొక కామకళా
గ్రంథమును వ్రాసి ఉన్నాడు. అందు సాంప్రయోగాధికారము మాత్రమే నిలచియున్నది.
భార్యాధికారము, పారదారికము, వైశికాది అధికరణములున్న గ్రంథము లుప్తమై
పోయినది. ఇతడు ప్రధానముగ రతిరహస్య మార్గమును అనుసరించినాడు. ఇది
ఒకరీతిగ నా గ్రంథమునకు వ్యాఖ్యానమని చెప్పవచ్చును!
కల్యాణమల్లుని అనంగరంగము తదుపరి పేర్కొనదగిన ప్రధాన గ్రంథము.
ఇతడు ఒరిస్సా రాజగు లడదేవుని (అనంగ భీముడు) ఆస్థానకవి అని కవిచరిత్రల
వలన తెలియుచున్నది. కాని ఇతడు అహమ్మదుఖానుని కుమారుడగు లడఖానుని
కోరిక ననుసరించి అనంగరంగ రచనమునకు పూనుకొనినాడని ఏతద్గ్రంథ, ద్వితీయ,
తృతీయ శ్లోకముల వలన తెలియచున్నది. ఇతడు గుజరాతు దేశ నాయకుడు. ఇతని
తండ్రి క్రీ.శ. 1488-1517 మధ్య రాజ్యమొనర్చిన సికందరు సుల్తాను కాలముననున్న
ఒక ప్రభువని తెలియుచున్నది." అందువలన కల్యాణమల్లుడు క్రీ.శ. 15వ శతాబ్ది
114
వావిలాల సోమయాజులు సాహిత్యం-4