Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/900

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ మాటలు మారువేషమున ఉన్న అక్బరు చెవినబడెను. ప్రక్కన ఉన్న వేడుక చెలికాడగు రాజా బీర్బలుతో "మిత్రమా! వినినావా? ఈ బ్రాహ్మణుడు ఏడురూపాయల జీతము ఇచ్చిన భార్యకు ఏడు అంతస్తుల మేడ ఎక్కించునట ! వీని తెలివితేటలు ఏమో పరీక్షింపవలయును" అని అక్బరు మరియొక వీథికి వెడలిపోయెను.

మరునాడు బ్రాహ్మణునికి అక్బరు పాదుషా ఒక తాఖీదు పంపెను. అందు “నీవు సాయంత్రము నాలుగు ఘడియలకు దర్బారుకు రావలెను" అని ఉన్నది.

బ్రాహ్మణుడు దానిని చదువుకొనెను. తనను ఏమిటి? పాదుషా పిలిపించుట ఏమిటి? అతనికి ఏమియు అర్థము కాలేదు. భార్యతో ప్రతి నిత్యమును రాత్రులందు గడచిన రాత్రివలె మాట్లాడుట అతనికి పరిపాటి. రాత్రి ఏమి మాట్లాడునో ఉదయము అతనికి జ్ఞప్తి ఉండదు.

పాదుషా కడనుండి వచ్చిన తాఖీదుకు తన భార్య కారణమును ఏమైన చెప్పగలదేమో అను ఉద్దేశ్యముతో భార్యను పిలిచి ఆ సంగతిని ఆమెకు చెప్పెను.

ఆమె “రాత్రి మీరు పెద్ద గొంతుకతో నేడు ఉద్యోగములు అన్నియు మహమ్మదీయులని అని పలికినారు. రాత్రులందు పాదుషా నియమించిన చారులు గ్రామము అంతటను తిరుగుచుండుట మీకు తెలియును గదా! ఒక వేళ ఏ చారుడైన రాత్రి మీ ప్రవర్తనను గూర్చి పాదుషాకు విన్నవించి ఉండును" అని తాఖీదుకు తనకు తోచిన అర్థమును చెప్పెను.

తన భార్య చెప్పిన విషయము నిజము కావచ్చును అని బ్రాహ్మణునకు తోచినది. కాని ఆమె చెప్పినది నిజము అని ఆమె ఎదుట అంగీకరించిన తాను తెలివి తక్కువవాడు అగును. అందుచే అతడు:

“నీవు చెప్పినది నిజమని నేను అనుకొనను. పాదుషా ఇట్టి స్వల్పవిషయములను పట్టించుకొనువాడు కాదు. ఆయనను నన్ను పిలిపించి శిక్షించిన మాత్రమున పాదుషా లోకులు అందరి నోళ్ళు మూయకలడా?

"అది కాదు. జ్ఞప్తికి వచ్చినది. నీతో ఉద్యోగమునకు వ్యతిరేకముగ ఉన్నట్లు ఎన్ని మాటలు పలికినను దానికై నేనును ప్రయత్నించుట మానలేదు. కొలది కాలము క్రిందట ఒక మిత్రుని మూలమున నా తెలివితేటలను గూర్చి జహంగీరు యువరాజుకు చెప్పించితిని, అతడు పాదుషాకు తెలియచేసి ఉండును. అందువలననే పాదుషా