Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/886

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పరీక్ష

గజనీ మహమ్మదు మహావీరుడు, ఇతడు రాజ్యమునకు వచ్చిన వెంటనే గొప్ప సైన్యములతో పరదేశములపై దండయాత్రలు చేసెను. అనేక దేశములను కొల్లగొట్టెను. ఆ విధముగా సంపాదించిన ధనముతో పెద్ద సామ్రాజ్యమును నిర్మించెను. దానిని కడుజాగరూకతతో పాలించుచుండెను.

విశాలమైన అతని సామ్రాజ్యమును పాలించుటలో మహమ్మదుకు కొందరు మంత్రులు తోడ్పడుచుండిరి. వారిలో ముఖ్యుడు అయాజ్.

అయాజ్ కడు సమర్థుడు. అతని రాజభక్తి సాటిలేనిది. ఇతడు దేశములోని ప్రజలు అందరును క్షేమముగా జీవించుటకు తగిన ఏర్పాటులను ఎన్నో కావించెను. రాచకార్యము లందును, ప్రజలను పోషించుటయందును ఇతడు శ్రద్ధ వహించుట ప్రభువగు మహమ్మదు గమనించెను. ఆ కారణమున చక్రవర్తి గజనీ మహమ్మదుకు అతనిపై మిక్కిలి అభిమానము, అధికగౌరవము.

ఇతర మంత్రులు ఆయాజ్పై చక్రవర్తి ఇంతటి అభిమానమును గౌరవమును చూపుట సహింపలేకపోయిరి. వారు ఈర్ష్య వహించిరి. అయాజ్ యెడ చక్రవర్తి మనస్సును విరుచుటకు ఎన్నెన్నో కుట్రలు పన్నిరి.

కాని సత్యము ఎన్నడును దాగదు గదా ! వారి ప్రయత్నములు అన్నియును వ్యర్థమైనవి. ఇందరును చేరి అయాజన్ను పడగొట్టదలచుటకు మూలమైన గారణమేమో చక్రవర్తియగు మహమ్మదు గమనించెను. వారి ఈర్ష్య అతనికి అర్థమైనది. అతడు అయాజ్న పూర్వముకంటె అధికముగా ప్రేమించి గౌరవించుచుండెను.

మంత్రుల పన్నుగడలు అన్నియును నిరుపయోగములైనవి. మీదుమిక్కిలి మహమ్మదు తమ శత్రువగు అయాజ్పై ఎక్కువ ప్రేమను గౌరవమును చూపుచుండెను. వారు ఇందుకు కారణము ఏమైయుండునో తెలిసికొనుటకు కుతూహలపడిరి.

వినయము, భయము, భక్తి తొణికిసలాడుచుండగా వారు ఒకమారు చక్రవర్తి మహమ్మదును సందర్శించిరి. కొంతసేపు ఇతర విషయములు ప్రసంగించిరి. తరువాత: