శాతకర్ణి గురుదేవునికి నమస్కరించి వారికథ చెప్పెను.
అతని భుజముపై దట్టి “నీవువీరుఁడవని యాచార్యుఁడభినందించినాడు. నూతన విద్యార్థులనేకులతని సగౌరవముగ ప్రోత్సాహముతో సంభాషించినారు. గయా శీర్షుని నమస్కరింప 'నిన్నుజూచి గర్వించుచున్నా'నని యతని నొక చిఱునవ్వుతో నాశీర్వదించినాడు 'మఱల నెన్న డిట్టి సాహస ప్రదేశములలో బయనింపవలదని యాదేశించినాడు.
ఆచార్య కాశ్యపు డేకాంతమున నతనితో "వెనుక నొకదోషిగ నిన్నుచూచినాను. ఈనాడు నీవు విద్యార్థులలో సాహసి వనిపించు కొనినావు. కొలదికాలము నుండి నీలో మార్పు వచ్చినదని వినుటకు నాకమితానందముగ నున్నది" అని నాడు.
శాతకర్ణి భరింపరాని సంతోషముతో నతనికి బాదాభివందన మాచరించినాడు.
8
పరీక్షలందు బ్రథమ శ్రేణిలో నుత్తీర్ణులగుటకై విద్యార్థులు విశేషముగ గృషి యొనర్చుచున్నారు. శిఖి యొక దినమైన వృథాబోనిచ్చుట లేదు. శరీర స్వాస్థ్యము లేక నేదినమైన బారము వినకున్న గయాశీర్షుని యింటికేగి ప్రత్యేకముగ నతఁడు జెప్పించుకొనుచున్నాడు. రాత్రింబవళ్లు నిద్రాహారము లెఱుగక నతడొనర్చిన విద్యాశ్రమకు దగిన ఫలితమేమికానున్నదో!
గడచిన సాయంత్రముతో బరీక్షలైపోయినవి. ఆచార్యులు నుపాధ్యాయులు, ఫలితాంశములు వెల్లడించుటకు ముందు సభలుగావించి సంప్రదింపులు జరిపినారు. ఉత్తీర్ణతకు కేవలం విద్యావైదుష్యములు చాలవు. వారి విద్యాబుద్ధులు, నీతి నియమము దానికి తోడ్పడును. రత్నోదధి గ్రంథ భాండాగారమునకు ముందున్న స్థలమున సాయంతన వేళ పెద్ద సభ జేసినారు. ఫలితాంశములు విన గుతూహలముతో విద్యార్థులందఱునట జేరినారు.
ఉన్నత వేదికపై శీలభద్రు లుపవిష్ణులైనారు. గయాశీరుఁడు, మౌద్గల్యాయనుఁడు, కాశ్యపుఁడు, అమృతవర్షుఁడు, ధారావీయూషుఁడు మొదలైన యాచార్యులు, నుపాధ్యాయులు వారి స్థానముల నలంకరించినారు.
శిఖి శాతకర్ణి యతని కక్ష్యలో బ్రథముడుగ నుత్తీర్ణుడైనాడు. మంగళుని కక్ష్యలలో నతడు ప్రథముడు. ధ్వజకేతువు ద్వితీయుఁడు. 'ప్రమతిని' నాలంద ప్రథమ విద్యార్థిగ