Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/711

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కామాయనీ భిక్కుని శిఖిశాతకర్ణికి వినయ విహారమున నివాసగృహ కక్ష జూపించినది. వస్తువులకు స్థాన నిర్దేశ మొనర్చుకొని యనుగుణముగ వాని నమర్చుకొనినాడు. విశేషము లేమియు లేక నా దినము గడచినది.

మరుసటి దినమున ప్రభాతవేళ మేల్కొని కాలకృత్యములు దీర్చుకొని బుద్దపూజానంతరము శిఖి విద్యామందిరమున కరిగినాడు. విద్యార్థు లొనర్పరాని కార్యపత్రిక 'ప్రతిమేక్షము'ను శ్రద్ధతో బరించినాడు.

చదరలపై గూర్చుండి విద్యార్థులు ముచ్చటలు జెప్పుకొనుచు కాలక్షేప మొనర్చుచుచున్నారు. ప్రాత విద్యార్థులకు నూతనముగ బ్రవేశించువారిని బేరులు పెట్టి యాటలు బట్టించుట పరిపాటి. శాతకర్ణి కక్ష్యలో విజితావి యట్టివారిలో మేటి. శిఖిని జూచిన తక్షణమే “ఏమోయి 'ఎఱ్ఱతేలు!' నీ పేరేమి?”టని ప్రశ్నించినాడు. అది కేవలము ధూర్తత. శాతకర్ణి జంకలేదు. నిశ్చలముగ 'శిఖి'యని సమాధానము జెప్పినాడు. అతని సంబంధ బాంధవ్యములు దెలుసుకొనిగాని యేడ్పింపరాదని నిశ్చయించుకొని విజితావి శాతకర్ణిని జేరబిలచి విచారించినాడు. అతని యొద్దనుంచి విలక్షణమైన సమాధానములు వచ్చినవి. విజితావి కాశ్చర్యము కలిగినది. అయిన దానిని బహిరంగ మొనర్పక నూతనముగ వచ్చిన మరియొక విద్యార్థి కుబ్జునకు, శాతకర్ణికిని 'కజ్యము'ను గల్పించి యానందింపదలచి యిరువురను గవ్వించినాడు.

వారికి రోషము హెచ్చ కుబ్జుడు విజితావి యిచ్చుచున్న స్తోమతను జూచుకొని శిఖి ముఖముపై నొక దెబ్బకొట్టినాడు. ప్రతిగ నతడు చేయినెత్తబోవ 'చిన్నవానిపై జేయి చేసుకొనుచున్నావా?' యని విజితావి బెదరించినాడు.

“క్రొత్తగా జేరిన వారికి 'పుల్లింగములు' పెట్టి పోరాడించి యానందించుట సిగ్గుచేటు” అని దూరముననుండి చూచుచున్న మంగళుడు విజితావిని నిందించినాడు.

"పిఱికివాడు వాడేమి పోరాడు" ననుచు కుబ్జుడు శాతకర్ణి మీదికి తరుముకొని యొంటి కాలిపై వచ్చుచున్నాడు.

'నేను నీతో తలపడ’నను శాతకర్ణి మధురకంఠస్వరము విద్యార్థుల నెందులకో యాకర్షించినది. మంగళుడు ముందుకు వచ్చి 'కారణమే'మని ప్రశ్నింప శిఖి యిట్లు సమాధానము చెప్పినాడు.

'కారణము లేనిది కలహమెందులకు? అయిన నా చిన్నవాడు నాకు 'ఉజ్జీ'కాడు.' కొందరు బాలకులతని యుదాత్తతను గుర్తించి గౌరవింప నారంభించినారు. విజితావి