Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రోజుల వ్యవధి ఉంది. షేక్స్పియర్ దాన్ని ఎత్తివేశాడు. కాలవ్యవధిని, సన్నివేశ బాహుళ్యాన్ని తగ్గించి విషాదాంతస్థాయిని పట్టటం కోసం నాటకతత్త్వాభిజ్ఞుఁడైన షేక్స్పియర్ ఈ మార్పులు చేసి ఉంటాడు. ప్లూటార్క్ లో కేవలం పట్టికగా ఇచ్చిన శకునాలను, హఠాత్సంభవాలనూ అతినైపుణ్యంతో షేక్స్పియర్ సమయోచితంగా ఉపయోగించుకొన్నాడు. ప్లూటార్క్ లోని బ్రూటస్ క్రూరశక్తినే షేక్స్పియర్ సీజర్ భూతాకృతితో సమన్వయించాడు. ప్లూటార్క్ ఇచ్చిన కొద్ది సూచనలో ఆంటోనీ మహాప్రసంగాన్ని కల్పించటం, పోర్షియావర్ణనలోనూ, పాత్ర పోషణలోనూ కన్పించే ప్రావీణ్యం, సిన్నా హత్యలో ద్యోతకమయ్యే పరిహాసరేఖలు, అక్కడ ప్రదర్శించిన జనసామాన్య స్వభావ చిత్రణమూ ఇత్యాదులన్నీ షేక్స్పియర్ ప్లూటార్క్ పై దిద్దిన వన్నెచిన్నెలు.

షేక్స్ పియర్ పాత్రోన్మీలనం - మార్పులు

షేక్స్పియర్ చిత్రించిన సీజర్ చరిత్రలో కన్పించే ప్రపంచాగ్రగామియైన మహావీరుడు, మహారాజనీతిజ్ఞుడు కాడు. అతడికి వైభవ ప్రియత్వం, గర్వోన్మత్తత, ఔద్ధత్యం, స్తోత్రప్రియత, కొన్ని శారీరక మానసిక దౌర్బల్యాలను షేక్స్పియర్ మహాకవి కల్పించాడు. నిజానికి చరిత్రలో తోచే సీజర్ నే చిత్రిస్తే ప్రేక్షకులకు విద్రోహవర్గంమీద అణుమాత్రమైనా అభిమానం ఉండటానికి తావుండదు. బ్రూటస్, కాషియస్ లకు ఆదర్శాన్నిచ్చి షేక్స్పియర్ వారి పాత్రలను పోషించాడు. సీజర్ సామ్రాజ్యతత్త్వ ప్రవక్త అతడికి ప్రతిగా ప్రజాస్వామికతత్త్వప్రవక్తనుగా బ్రూటస్ ను తీర్చిదిద్ది, షేక్స్పియర్ ప్లూటార్క్ లో కనిపించే అతడి లోపాలనన్నింటినీ వదిలివేశాడు. మహానగర రక్షణాధికారవిషయంలో బ్రూటస్, కాషియస్ ప్రత్యర్థులు. అందువల్ల వారిద్దరి మధ్యా సన్నిహితత్వం లేదు. ప్లూటార్క్ లో కన్పించే ఈ అంశాన్ని కొంతగా గ్రహించి వారిద్దరి మధ్య అసన్నిహితత్త్వాన్ని ప్రథమాంక ద్వితీయదృశ్యంలో ప్రదర్శించాడు గాని షేక్స్పియర్ అందుకు బ్రూటస్ మహాశయుని హృదయాంతర్యుద్ధాన్ని కారణంగా కల్పించాడు. అంతేకాక బ్రూటస్ ను సీజర్ కు సన్నిహిత మిత్రుణ్ణి చేశాడు. దీనివల్ల బ్రూటస్ ను ఒక ఆదర్శం కోసం నిలిచి మిత్రుణ్ణి కూడా హత్య చేయటానికి వెనుకాడని వీరపురుషుడుగా చిత్రించటం జరిగింది. పోర్షియా బ్రూటస్ ను వివాహమాడటానికి పూర్వం బిబులస్ అనే భర్తను చేపట్టి అతడివల్ల ఒక కుమారుణ్ణి పొందినట్లూ, అతడు కథాకాలంనాటికి యవ్వనదశ ననుభవిస్తున్నట్లూ ప్లూటార్క్ లో ఉంది. బ్రూటస్ వంటి అత్యుత్తమ వ్యక్తికిది కళంకాపాదకం కాబట్టి తొలగించి, బ్రూటస్ దంపతుల ప్రణయాన్ని ఆదర్శయుతంగా


జూలియస్ సీజర్ 21