పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారిత్రిక, సాంఘికేతి వృత్తాలు రెండూ సోమయాజులు గారికిష్టమైనవే. దేశభక్తి వంటి విలువలను, నైతిక సందేశాలను అందిస్తాయి వీరి నాటికలు. ఈ సంపుటంలో ఈ మూడు పెద్దనాటికలతో పాటు మరో పదమూడు చిన్న నాటికలు చోటుచేసుకున్నాయి.

ఈ సంపుటంలోనే సోమయాజులుగారి ఎనిమిది గేయ నాటికలు కూడా ఉన్నాయి. గేయాన్ని దృశ్యరూపక ప్రక్రియకు ఆయన చక్కగా మలిచారు.

జయదేవ మహాకవి రచించిన 'పీయూషలహరి' గోష్ఠీ రూపకాన్ని సోమయాజులు గారు అనువదించారు. భావ, శబ్ద సౌందర్య సంపన్నమైన జయదేవుని రచన సామాన్యకవులకు లొంగేది కాదు. సోమయాజులు గారు మూల కావ్య సౌందర్యాన్ని అనువాదంలోనూ నిక్షేపిస్తూ తమ కవితా ప్రతిభను చాటుకున్నారు. మూలంతో పోల్చుకోవడానికీ, అనువాదంతో పాటు మూలాన్నీ ఆస్వాదించడానికీ మూలకృతిని కూడా దీనితో పొందుపరచడం వారి సహృదయానికి నిదర్శనం.

డి. చంద్రశేఖర రెడ్డి