ఒరిస్సాలోని ప్రాచీననది ఒడ్డున ఉన్న కెందులి అని అనటం సమంజసం అని చరిత్రజ్ఞులు నిర్ణయించినారు.[1]
కెందులి వీరభూమి జిల్లాలోని అజయ నది ఒడ్డున ఉన్నదని కొందరు భ్రమపడి వ్రాయటానికి కారణాలు క్రింది ఈ రెండు శ్లోకాలు.
“గోవర్ధనశ్చ శరణో జయదేవ ఉమాపతిః
కవితారాజశ్చ రత్నాని సమితౌ లక్ష్మణశ్చచ”
(వీరభూమి వివరణము పే 196)
"వాచః పల్లవయ త్యుమాపతిధరః సందర్భ శుద్దింగిరామ్
జానీతే జయదేవ ఏవ, శరణశ్లాఘ్యో దురూహ ద్రుతేః
శృఙ్గారోత్తర సత్ప్రమేయ రచనై రాచార్య గోవర్ధనః
స్పర్దీ కోపి న విశ్రుతిధరో ధోయీకవి క్ష్మాపతిః"
(గీతగోవిందం సర్గ 1. శ్లో. 4)
ఇందలి మొదటి శ్లోకమును నవద్వీపములోని సభామంటప భిత్తిక మీద ఉండగా
శ్రీవాది సనాతన గోస్వామి చూచినట్లు వంగదేశంలో ఒక ప్రథ ఉన్నది కానీ సనాతన
గోస్వామి ఈ విషయాన్ని గురించి ఆయన గ్రంథాలలో ఎక్కడా పేర్కొనలేదు. అందువల్ల
ఈ శోక్లాన్ని ఎవరో జయదేవుని వంగవాసిని చేయటానికి కల్పించి ఉంటారు. "వాచః
పల్లవ యత్యుమాపతిధర” ఇత్యాది శ్లోకాన్ని జయదేవ మహాకవి వ్రాసి ఉంటాడని
అనటానికి వీలులేదు. అది ఎవరివల్లనో 'గీతగోవిందం'లో ప్రవేశించి ఉంటుంది.
గీతగోవిందప్రబంధానికి ప్రప్రథమంలో వ్యాఖ్యానం వ్రాసిన కుంభరాణా పలికిన
"ఇదానీంకవిః కవి గణనాయాం పరైరపి కవిభి రహం పరిగణిత ఇతి స్వప్రశంసార్థం
క్షేపకమపి తత్కృతం శ్లోకం స్వగ్రంథస్వ కుర్వన్నాహ” అన్న వాక్యం నేటి చరిత్రజ్ఞుల
పైఊహకు ఉపోద్బలకంగా కనిపిస్తుంది. కుంభరాణా అభిప్రాయం కూడా దీన్ని ఎవరో
గీతగోవిందంలో ప్రవేశపెట్టి ఉంటారనే.
కాబట్టి వంగదేశం జయదేవుని జన్మస్థానమని చెప్పటానికి ఎవ్విధమైన ఆధారమూ కనిపించడం లేదు. అతడు ఉత్కల దేశస్థుడనుటమే సమంజసము. దీనికి అనుగుణంగా
ప్రాచీనులు వ్రాసిన గ్రంథాలలో ప్రబలాధారాలు కనిపిస్తున్నవి. సంస్కృత భాషలో- ↑ Journal of the Kalinga Historical Research Society, March 1947 Introduction to Kavi Jayadeva in Gita Govinda-H.K. Mukharji.
పీయూషలహరి
519