మీరా: కాదు, కాదు. పరమాత్మస్వరూపుని మనోనాథుని చూపించిన పుణ్యాత్ముడవు.
రాణా: క్షమాపణ అర్థిస్తున్నాను దేవీ! నిన్ను ఎన్నో బాధలు పెట్టాను. (మోకరిల్ల బోతాడు).
మీరా : కాదు, కాదు. (అని వారిస్తూ తానే మరీ వంగి నమస్కరించి) పొరబాటు, రాణా! నీరూపకంగా ప్రభువు నన్ను పరీక్ష చేశాడు నీలోపము ఇక్కడ ఏమీలేదు.
రాణా: దేవీ! మహారాజుననే భ్రాంతిలో మత్తెక్కిన నాకేదైనా తరణోపాయం చూపించి అనుగ్రహించమని ప్రార్ధన!
మీరా: గురు జ్ఞానము తప్ప వేరేమార్గము ఏమీలేదు. వెళ్ళి వస్తాను నాకు సెలవివ్వండి.
రాణా: దేవీ! ఎక్కడికి?
మీరా: ఎక్కడి కేమిటి? బృందకు. నా ప్రభువు బృందలో ఉంటాడు. పోయి ఆయన్ను కలుసుకోవాలి. ఇక నాకు అమృతత్వం తప్ప వేరేలోక యాత్ర లేదు.
రాణా: (నిశ్చేష్టుడై నిలువబడతాడు.)
మీరా: బృంద బృంద బృంద భక్తలోక మందారమే బృంద
బృంద బృంద బృంద సాధులోక చంద్రికయే బృంద
(గోసాయీలు ఆమెను పాటలో అనుసరిస్తారు. రాణా కనుచూపుమేర వరకూ వంగి
నిలుస్తాడు).
510
వావిలాల సోమయాజులు సాహిత్యం-2