Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుధాదేవి : (పట్టిక చేతిలో గ్రహించి) మనము మొదట వర్తక శేష్ఠులతో పరీక్ష ప్రారంభిద్దాము.

అమాత్యుడు : వీరెల్ల నా 'ప్రత్యేక సభ'లో నున్న రాజపుత్రులేనని సంతోషపూర్వకముగా మనవి చేయుచున్నాను.

బుధాదేవి : రాజగణకు డెంతమంది పరీక్షింపబడ్డారో మనవి చేయగోరుతున్నాను.

గణకుడు : ఇంతవరకొక్కరుడైన పరీక్షింపబడలేదని నేను మహారాజ్ఞికి సవినయంగా మనవి చేయుచున్నాను.

బుధాదేవి : ఎందువల్ల?

గణకుడు : అమాత్యుల వారింతవరకూ 'సంతుష్ట” శబ్దమున కర్ధనిర్ణయమొనర్చుట పూర్తిగావింపనందున నింతవరకెవ్వరిని పరీక్షించుట కవకాశము దొరకక నేను సవినయముగా మనవి చేయుచున్నాను.

బుధాదేవి : ఈ అర్థనిర్ణయ విషయంలో ఎన్ని మతభేదాలేర్పడ్డవో చెప్పగలవా?

గణకుడు : ఇంతవరకా శబ్దార్థ నిర్ణయమును గూర్చి కలిగిన మతభేదములు పంచాశత్తు (పొరబడి) నూన పంచాశత్తు - నిన్నటి సాయంత్రమున శబ్దార్థ నిర్ణయయుగములో నొకడు మరణించెనని స్థానమునకు వార్త వచ్చినది.

బుధాదేవి : ఆ పోనీ. అర్థ నిర్ణయం జరిగిన తరువాత అట్టి సంతుష్ట స్వాంతుడెక్కడ చిక్కుతాడని?

(మరొక వర్తకుడు ప్రవేశము)

బుధాదేవి : నీవు నవద్వీపాలతో వ్యాపారం చేస్తున్నావు కదూ.

శ్రేష్ఠి : యాడిదీ తొమ్మిది దీపాలతోనేగా... మా బుచ్చిచెట్టి పదకొండు దీపాలతో వర్తకం -

మరొక శ్రేష్ఠి : ఎంత యాపారం ఏడిస్తే ఏం - పిల్లలో పిల్లలు -

మరొక శ్రేష్ఠి : అజీర్ణం. కడుపుకు తిని సచ్చిందాడుంది. అరుగుద్దా - ఎప్పుడూ సబ్బుల్లిపాయ. పచ్చిపుల్సు ఇంతేగా - తిండో తిండి.


494

వావిలాల సోమయాజులు సాహిత్యం-2