Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుధాదేవి : అమాత్యా! ధనమున్నంత మాత్రాన సంతోషం ఉండనవసరం లేదని అర్థమైపోయింది. అంతకంటే ధనికులు సుఖంగా ఉండలేరందాము - సరే - సరే పనిపట్టికలో వ్యక్తులను పూర్తిచేయాలి.

కొన్ని గొంతుకలు :


(వేగంగా) సంతోషంతో ఉండటం పాపం

(నెమ్మదిగా పీల గొంతుతో) పూర్వం సంతోష ముండేది.

(గట్టిగా) నాకు పిచ్చి

(కోపంతో) నా కూతురు అన్నం పెట్టలేదు.

(నెమ్మదిగా) మా అత్తగారింట్లో బాధలు

(నిర్నివేశంగా) పెళ్ళాం చెప్పిన మాట వినదు

(నిశ్చలంగా) ఉద్యోగం లేదు


అమాత్యుడు : రక్షభట శ్రేష్ఠా!

బుధాదేవి : ఇప్పుడు ఘంటిక మ్రోగించుట మన అవసరము.

అమాత్యుడు : పనియతి త్వరితముగా గావలయును.

(కార్యవాహకుడు నిష్క్రమిస్తాడు)

బుధాదేవి : ఈ కోటానుకోట్ల వర్తక శ్రేష్ఠులు సర్వవిధ సంతుష్ట మనసులని నేనూహిస్తున్నాను.

భటుడు : రక్షకభటా!

భటుడు : చిత్తము - “వర్తక శ్రేష్ఠుల ప్రవేశపెట్టు -

(ప్రక్కవాకిలినుంచి నిష్క్రమించి ఒక వర్తకుడితో ప్రవేశిస్తాడు)

బుధాదేవి : (వర్తకుణ్ణి చూచి) ఇతడు బాగా చియ్యపట్టి సంతోషంతో ఉన్నట్లున్నాడు.

శ్రేష్ఠి : "నేను అసంతృప్తితో లేని మాట వాస్తవమేకాని, యాపారముందే యాపారం ఒడుదొడుకులతో కూడింది. లాబాలో లాబాలు - యాడవి అన్నీ ఏ పన్ను లే పన్ను చంతోషమే - చంతోషమే యాడిది.


ఏకాంకికలు

495