Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోకాలల్లో భోగాలను అనుభవించటానికేనట! కర్మత్యాగం వల్ల తప్ప చివరకు గురుభక్తి కూడా కుదురుకోదట!

చయనులు: ఆరి పుండా కోర్! కష్టసాధ్యమైన కర్మమార్గం అధమస్తుల దృష్టిలో అధమంకాక ఏమౌతుంది. యజ్ఞ యాగాలల్లో కర్మిష్ఠులు కొలిచే దేవతలంటే మంత్ర శక్తులనీ, యజ్ఞాలంటే కామధేనువులనీ ఎరగని యంబ్రహ్మలు ఏవేవో చెపుతుంటారు. మంచి చెడ్డ ఎఱగని పసి మనస్సులను అవి పట్టుకుంటాయి. అందాకెందుకు ఈ మధ్య జ్ఞానవాదులంటూ ప్రత్యేకంగా బయలు దేరారు కొందరు. ఈ అలస స్వభావులు పుట్టుకనుంచే బ్రహ్మజ్ఞానుల్లా "ఓ మిత్యే కాక్షరం బ్రహ్మ, తత్త్వమసి, అహం బ్రహ్మాస్మి, సోహం” ఇత్యాది ఉపనిషద్వాక్యాలకు విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈనాడు గీతకు ఎవరి ఇష్టం వచ్చిన వ్యాఖ్యానం వారిది. అన్నీ యోగాలే. అంతా జోగులే. కర్మ భ్రష్ఠులు!! యోగులట! జ్ఞానులట!! అన్ని అపమార్గాలూ గీత పేరుతో చెల్లిపోతున్నవి.

జోగన్న: బావగారు! మీరు ఎలాగైనా మా శంకరాన్ని మంచి మార్గానికి త్రిప్పి మీ అల్లుణ్ణి చేసుకోవాలి సుమా! వాడిచేత మీరు బ్రహ్మగా మహనీయమైన ఒక మహా యజ్ఞం చేయించాలి.

చయనులు: తప్పక చేయిస్తాను. మర్నాటికల్లా ఆ యోగిగాడిని మంగళంపల్లి పొలిమేరలలో లేకుండా తరిమేయిస్తాను. జగ్గన్నా! ఇది యజ్ఞేశ్వర సాక్షిగా చెపుతున్నమాట! మంచిది ఇక నీవు లోపలికి వెళ్ళి స్నాన సంధ్యాద్యనుష్ఠానం పూర్తి చెయ్యి. ఇదిగో! అమ్మాయితో మామగారికి నీళ్ళు తోడి ఇవ్వమని చెప్పు.

జోగన్న: బావగారు మరి సెలవా!

చయనులు: ఇదుగో అమ్మీ! మనం మటుకు అంత తొందరపడితే ఎలా! ఏదో చెడిపోయిన వాడిని బాగు చేసుకొని అల్లుణ్ణి చేసుకొంటే తరువాత అతగాడు చెప్పినట్లు వింటాడు. అటువంటివాళ్ళ వల్లనే ఇచ్చుకున్న పిల్లలకు ఎంతైనా సౌఖ్యం ఉంటుంది.

4

(సర్వం శ్రీయజ్ఞేశ్వరార్పణ మస్తు... అమ్మా మంగళహారతి కానివ్వండి. అన్న పురోహితుడికి వాక్యాల తరువాత 'శ్రీరామచంద్రునకు సీతా సమేతునకు' మంగళం, మంగళంపల్లిపుర మహిత రాజేంద్రుడు మంగళం నిత్య శుభమంగళమ్' అన్న హారతి వినిపిస్తుంటుంది.)


ఏకాంకికలు

477