దాని అపమార్గాన్ని మాన్చగలిగాను. కానీ కుఱ్ఱవాణ్ణి సరిదిద్దటం నాకు కష్టమై పోయింది. ఇందుకు అన్ని సంపత్తులూ కల మిమ్మల్ని అర్థించటానికని వచ్చాను.
చయనులు: అసలు విషయ మేమిటి?
జోగన్న: కుఱ్ఱవాడు శంకరం ఒక కపటయోగి వలలో పడ్డాడు. వాడు ధ్యానయోగమని కొన్ని గారడీలు చూపించి ఇంటిమీద బుద్ధి లేకుండా కుఱ్ఱవాణ్ణి అరికట్టేశాడు.
చయనులు: ఇంతకూ కుఱ్ఱవాడు కర్మభ్రష్ఠుడైనాడన్నమాట! పెళ్ళి అయిన కొద్ది రోజుల్లోనే వాడికి యాగదీక్ష ఇప్పిద్దామనుకున్నాను. చెప్పుకున్న శ్రౌతమంతా గుంటలో పెట్టి గంట వాయించాడన్న మాట!
జోగన్న: అంతటితో ఆగితే చాలు. ససేమిరా నాకు పెళ్ళి వద్దంటున్నాడు.
సూరమ్మ: అన్నగారూ! అటువంటివాడికి బలవంతాన పిల్లనిచ్చి అంటగడితే తరువాత అది మన జీవానికి ఏడవవలసి వస్తుంది. ఏమండోయ్! ఈ సంబంధం నాకేం నచ్చలేదు. ఇంత ఉన్న వాళ్ళం. అవసరమైతే మరో ఎకరం మాగాణి ఇచ్చి ఐనా సరే ఎక్కడైనా మరో సంబంధం చూడండి.
జోగన్న: అక్కగారూ! మీరు తొందరపడవద్దు. బావగారు కర్మిష్ఠులు సద్వంశంలో పుట్టిన కుఱ్ఱవాడు చెడిపోతుంటే సహించి ఊరుకోరని నా నమ్మకం.
చయనులు: ఊరుకుంటే మహా పాపం కదుటోయ్ జగ్గన్నా! ఏమైనా సరే! వాణ్ణి సన్మార్గానికి త్రిప్పి తీరాలి. మంగళంపల్లిలో నీ మాటంటే కాదనేవాడు ఎవడున్నాడు?
జోగన్న: సంతోషం బావగారు!
చయనులు: నేను ఇంత కష్టపడి కుఱ్ఱవాణ్ణి ఒకదారికి తెచ్చిన తరువాత నీవు మళ్ళీ ఏదో అడ్డుపుల్ల వేసి కట్నం విషయంలో పేచీ లేవదీయకూడదు సుమా! కానుకల విషయంలో కూడా అంతే.
జోగన్న: సర్వం మీ ఇష్టానుసారంగానే సాగిస్తాను. వాగ్దానం చేస్తున్నాను. మీ బోటి లౌకికుల వాగ్దానాలు చెల్లించేవి కావంటారా. ఈశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
చయనులు: ఇంతకూ కుఱ్ఱవాడు ప్రస్తుతమేమంటున్నాడు.
జోగన్న: గీతాకారుడు చెప్పిన కర్మ-భక్తి-జ్ఞాన-ధ్యాన మార్గాలల్లో కర్మమార్గం అధమాధమమట! వైదిక కర్మలన్నీ ఇంద్రలోకంలో నందనవనంలో ఇతర లోకపాలక
476
వావిలాల సోమయాజులు సాహిత్యం-2