యోగి: (గంజాయి పీలుస్తున్న చప్పుడుతో) జయ్‌శంకర్! (గాలి విడుస్తూ) జయ్ మహదేవ్!!
వెంకడు: స్వామీ! తాము ఇక్కడనే ఉన్నారు గదా తెలియకడుగుతున్నాను, కైలాసానికి ఎలా వెళ్ళి వచ్చారు?
యోగి: (నవ్వుతూ) వెంకట యోగీ! ఆత్మశక్తి చేత మేము అణిమాద్యష్ట సిద్ధులను సంపాదించాం. 'ఖేచరీ విద్య'తో ఒక కైలాస మేమిటి, ఇంద్ర, మహేంద్ర, బ్రహ్మలోకాలన్నీ తిరిగి క్రీడించి వస్తుంటాము.
శంకరం: గురుదేవా! ఇదంతా వేటి సహాయంతో...
యోగి: (చిఱు కోపంతో) వేటి సహాయంతోనా! పవమాన రూపంలో. అంగరూపాలైన మనస్సుతో, ఇంద్రియాలతో... సరి. చిత్తనిరోధం చెయ్యటంలో మీ రెంతవరకు వచ్చారు? గురుదేవులే మీకు సర్వమని భావించగలుగుతున్నారా? ఇవి మీకు కుదిరితే సమాధి నిమగ్నులై తేజోమయమైన ఆత్మ స్వరూపాన్ని దర్శించటం మీకు నేర్పుతాను. సంశయించటం మాని వేశారా?
వెంకడు: స్వామీ! తాము వెనక చెప్పింది నాకేమీ తలకెక్కలేదు. నిత్యమూ మీకు పాలు తెచ్చి యివ్వటం, మీ దర్శనం చేసి ఇంత చిలుము పట్టటం తెలిసింది.
యోగి: అయితే ఇప్పుడిప్పుడే గురుభక్తి కుదురుకొంటున్నదన్నమాట!
శంకరం: గురుదేవా! గీతలో పరమాత్మ 'సంశయాత్మా వినశ్యతి' అని చెప్పినా సంశయించటం మానవ స్వభావమై పోయింది. అందులో చెప్పిన నాలుగు దారుల్లో 'ధ్యాన యోగం' సర్వోత్తమమైంది.
ఇలా తమకు కోపం వస్తే నేనేమీ అడగనులెండి.
యోగి: (నవ్వుతూ) మీకు శిష్యులై ఉండి చిత్త నిరోధం చెయ్యలేక సంశయించినప్పుడు మాకు కొంత కోపం రావటం కద్దు. అంతటితో భయపడవద్దు. శంకర యోగీ! అడగలదలచిందేమిటో కానీ...
శంకరం: గీతలో చెప్పిన భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞానాలనే నాలుగు మార్గాలల్లో...
యోగి: 'ముక్తిమార్గం ధ్యానమొక్కటే' భగవంతుడు వేరు - జీవుడు వేరు, ఆయనకు దాస్యం చెయ్యటమే ముక్తి అని చెప్పే భక్తిమార్గం ఉపాసకుడికి ఆరంభ దశలో కొంత
ఏకాంకికలు
471