Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోతన్న : ఎవరురా యీ తల్లి - ఎక్కడో చూచినట్లే ఉంది కాని గుర్తురావటం లేదు. ఓహో నీవా తల్లీ! మల్లన్న అమ్మా! అమ్మా!! పోతన్న : అమ్మా! రాతల్లీ - అంబుజగర్భురాణీ, నవాంబు జోజ్వల కరాంబుజ - ఈ పేదవాడి కుటీరం మీద ఈనాటికైనా ప్రసరించింది తల్లీ నీ అమృతమయ వీక్షణం ధన్యుణ్ణి. (మంచంలో నుంచి లేచి ఊహాకల్పిత మూర్తికి నమస్కరిస్తాడు మోకరిల్లి) (తలపైకెత్తి) మల్లన్నా అమ్మను పిలూ అర్ధ్యం తీసుకురమ్మను. పాద్యం తీసుకు రమ్మను. తల్లి వచ్చింది. త్వరగా అమ్మను రమ్మను. మల్లన్న : (భయంతో వెనకటికంటే పెద్ద గొంతుకతో) అమ్మా! అమ్మా!! పోతన్న : తల్లీ! కవుల జిహ్వాగ్రంలో నాట్యమాడినంత మాత్రానే వాచాలురను చేసే నీకు నోటిమాటే రావటము లేదు తల్లీ - అదీ నా దారిద్ర్యమే కాబోలు - మల్లన్న : నాన్నా! (మాచమ్మ లోపలనుంచీ అబ్బాయీ ఏమిట్రా ఈ గొడవంతా అంటూ ప్రవేశిస్తుంది) మల్లన్న పైత్యంచిందని ఎంతచెప్పినా వినకుండా అమాంతం ఒకమాటు మంచంలోనుంచి లేచేటప్పటికి నాన్న ఆస్తు బిస్తయిపోయి ఏవో అర్థంగాని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. - ఒక పని మాచమ్మ : అయ్యో! అయ్యో! - త్వరగా వైద్యుణ్ణి పిలుచుకురా పోరా చేస్తారా - ఒకటే మూర్ఖం. ఆ మనిషి పట్టిందేపట్టు - నేను ఆ నొసటి కుంకుమకు కూడా నోచుకోలేదు కామాలి. మల్లన్న : అమ్మా! నీవేం భయపడనాకు. ఇదుగో ఆయన్ను కదిలించకుండా అలాగే విసనకర్రతో విసురుతూ ఉండు - (నిష్క్రమిస్తాడు) నీ పోతన్న : (దీనంగా) అమ్మా! నీ ముఖచంద్రుణ్ణి ఏవో కారుమేఘాలు కప్పేస్తున్నవి తల్లీ - అమ్మా కన్నీరా.... ఎందుకు తల్లీ - ఇలారా అమ్మా నన్ను తుడవనీ - నీ శతపత్ర నేత్రాలు వాడి పోనీయకమ్మా నా సర్వస్వమూ నీది. ఒక్కమాటు ఆ కారుమేఘాలన్నీ విరిసి పోయేటట్లు తరిపి వెన్నెలలు కాయించుతల్లీ నీ చిఱునవ్వుతో. ఏకాంకికలు - 373