Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాచమ్మ : ఎవరిస్తారు? మన పేరు చెపితే ఎక్కడ పట్టినా భగ్ధం పాడే. మల్లన్న అడుగో ఆ దారిన మారన్న మూటనెత్తిన పెట్టుకు వస్తున్నాడు. మరిచి పోయినాను. వెనుక మన కళ్లంలోనే పది మానికలు అప్పు తీసుకున్నాడు. ఇవ్వటానికి వస్తున్నాడనుకుంటాం. నువ్వు త్వరగా మడి కట్టుకొని ఆయనకు ఇవాళనైనా ఇంత ధారకం పోసేటట్టు చూడు. (మాచమ్మ నిష్క్రమిస్తుంది) (భార్య వెళ్ళిపోతుంటే) ఖోర్, ఖోర్ ఖోర్ మల్లన్నా! అనేక మాట్లు పరీక్షిస్తున్నాడు, ప్రభువు నన్నెంత అగ్నిపరీక్ష చేస్తున్నాడురా. తీరా సమయం వచ్చేటప్పటికి తానే ఆదుకుంటున్నాడు. మల్లన్న : మన దగ్గర అప్పు తీసుకున్న గింజలు ఇప్పించటమూ కూడా ఆదుకోటమేనా ఏమైనా ఆయన పరిపూర్ణ కటాక్షాన్ని ఆశించుకొని కూర్చుంటే. పోతన్న : రామచంద్ర ప్రభో - రామచంద్ర ప్రభో - జగద్రక్షకా తండ్రీ - (లేస్తాడు) మల్లన్న నాన్నా! ఏమిటా మంచంలోంచి లేచి పోవటం. నాలుగు లంఘణాలతో పైత్యించి ఆ కాస్తా విరుచుకుపడితే (దగ్గిరికి వచ్చి చేయిపట్టుకొని) దేహం ఇంత కాకెక్కుతున్నదేం (నాడి చూచి) జ్వరం మళ్లీ వచ్చేస్తున్నది. అంతర్గతం పూర్తిగా వదలలేదు మీకు. పోతన్న : జ్వరం కాదు... చట్టు బండలూ కాదు. మల్లన్న : మీకీ జబ్బుచేయటమూ నా దరిద్రమే. పోతన్న : లోకం దృష్టిలో నాకంటే పరమ దరిద్రుడెవ్వడున్నాడు. నాయనా - (మానసిక స్థితిలో మార్పు చూపిస్తూ) అబ్బాయీ, మల్లన్నా చూస్తున్నావా... అదుగో ఎక్కడిదా శతపత్ర సితాంబుజము.... పరిశీలిస్తున్నావా - ఆ అరుణారుణ పాదపల్లవ కాంతులు - నా మీద కనికరించి ప్రభువు వస్తున్నట్లున్నాడురా నేను దరిద్రుడననుకున్నానని ఆఁ కాదు కాదు నా ప్రభువు కాదు. అయితే ఆ అందెలచప్పుడు వినిపించదే కాంచీదామాన్ని చూస్తున్నావా... కాదురా సీతమ్మ తల్లిరా అయోధ్య నుంచి భక్తుణ్ణి చూచి పోదామని బయలుదేరి వచ్చినట్లుంది - - మల్లన్న : నాన్నా! మీకు బాగా పైత్యస్తున్నది. కాసేపు కళ్లు మూసుకొని పడుకోండి. నేను ఇంతలో కాస్త తేనె పట్టుకొస్తాను. 372 వావిలాల సోమయాజులు సాహిత్యం-2